విష్వక్ సేన్ హీరోగా 'దాస్ కా ఢమ్మీ' షూటింగ్ ప్రారంభం కాకుండానే డైరక్టర్ కు ఢమ్మీ తగిలింది. దాంతో డైరక్టర్ మారిపోయాడు. విష్వక్ సేన్ నే స్వంతగా డైరక్ట్ చేసుకుంటున్నాడు.
ఈ సినిమాకు పూజ చేసిన నాటికి డైరక్టర్ గా నరేష్ కుప్పిలిని అనుకున్నారు. అతగాడు గతంలో విష్వక్ సేన్ తో పాగల్ సినిమాను డైరక్ట్ చేసాడు.
కానీ పూజ నుంచి షూటింగ్ ప్రారంభం అయ్యే మధ్యలో ఏదో జరిగింది. డైరక్టర్ అవుట్ అయ్యాడు. హీరోనే డైరక్టర్ అయ్యాడు. ఈ విషయాన్ని చాలా సైలంట్ గా వుంచేసారు.
ఈ రోజు విష్వక్ సేన్ షూటింగ్ ప్రారంభం అవుతోంది అంటూ ఇచ్చిన ప్రకటనలో డైరక్టర్ ప్లేస్ లో విష్వక్ పేరు కనిపించింది. ఏంటీ కథ అని అడిగితే మార్చేసారు అనే సింపుల్ ఆన్సర్ వచ్చేసింది.
ఈ సినిమా నిర్మాణం కూడా విష్వక్ సేన్ హోమ్ బ్యానర్ మీదనే. అంటే హీరో, నిర్మాత, దర్శకుడు మూడూ విష్వక్ నే.