ఒకేసారి 2 సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి భారతీయుడు-2 కాగా, రెండోది గేమ్ ఛేంజర్. ఎంత కాదనుకున్నా ఈ రెండు సినిమాలు 6 నెలల గ్యాప్ లో రిలీజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మేటర్ అది కాదు.
శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2, భారతీయుడు-3 సినిమాలు జస్ట్ 6 నెలల గ్యాప్ లో రిలీజ్ అవుతాయంట. ఈ విషయాన్ని దర్శకుడు శంకర్ స్వయంగా బయటపెట్టాడు.
“భారతీయుడు చాలా పెద్ద స్టోరీ. మేం దాన్ని 3 గంటల్లో చెప్పలేకపోయాం. దానంతట అది పెద్దదిగా మారింది. అలా ఆర్గానిక్ గా 2 పార్టులుగా తయారైంది. భారతీయుడు-2 జులైలో రిలీజ్ అవుతుంది. అది రిలీజైన 6 నెలల తర్వాత భారతీయుడు-3 కూడా వస్తుంది.”
ఇలా భారతీయుడు ఫ్రాంచైజీపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు శంకర్. ఇదే విషయంపై పక్కనే ఉన్న కమల్ హాసన్ కూడా స్పందించారు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ చేయడానికి అసలైన కారణాన్ని వెల్లడించారు. భారతీయుడు-2 స్టోరీని, భారతీయుడు-3 కథతో కలిపి చెప్పాడట శంకర్. అందుకే సీక్వెల్ లో నటించడానికి అంగీకరించారట కమల్.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ లాంటి స్టార్స్ నటించారు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టారు.