మ‌రో టాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌కు క‌రోనా

మ‌రో ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్నే ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఇటీవ‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనా మ‌హ‌మ్మారి…

మ‌రో ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్నే ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. ఇటీవ‌ల ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి ఇంట్లోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్ నిమిత్తం ముంబ‌య్ వెళ్లి వ‌చ్చిన తేజకు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. క‌రోనా వైర‌స్‌కు గురి కాకుండా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నెల క్రితం ప్ర‌జ‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెప్పిన తేజ‌…తానే దాని విష కౌగిలి నుంచి త‌ప్పించుకోలేక పోయారు.

ఈ నేప‌థ్యంలో ఎందుకైనా మంచిద‌ని కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్న తేజ‌కు…ఆయ‌న అనుమానించిన‌ట్టే పాజిటివ్ వ‌చ్చింది.  కాగా త‌న‌కు క‌రోనా పాజిటివ్ రావ‌డంపై తేజ స్పందిస్తూ ….అందరూ ఇంట్లో ఉండి కరోనా తెచ్చుకుంటే తాను షూటింగ్‌కు వెళ్లి కరోనా తెచ్చకున్న‌ట్టు చెప్పారు.

అయితే  షూటింగ్‌ సభ్యులకు గానీ, త‌న‌ కుటుంబసభ్యులకు ఎవరికీ కరోనా రాలేదని తెలిపారు. కేవ‌లం త‌నొక్క‌డికే  కరోనా పాజిటివ్ వ‌చ్చింద‌న్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యం తీసుకుంటున్న‌ట్టు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి తేజ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని  ఆయ‌న  అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారు. 

ఏరు దాటాకా తెప్ప తగలేసిన బాబు