బాలీవుడ్ లో దిశా పాట్నీ- టైగర్ ష్రాఫ్ ల లవ్ స్టోరీ చాన్నాళ్ల పాటే కొనసాగింది. మొదట్లో తమ రిలేషన్ షిప్ గురించి అధికారికంగా ధ్రువీకరించని ఈ జంట ఒక రిసార్ట్ నుంచి వేర్వేరుగా దిగిన ఫొటోలతో క్లూస్ ఇచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ జంటగా విహరించారు. అయితే తమ బంధం గురించి ఎలాంటి కామెంట్లు చేసుకునే వారు కాదు! మిగతా బాలీవుడ్ ప్రణయ బంధాలతో పోలిస్తే దిశ- టైగర్ ల ప్రేమాయణం చాన్నాళ్ల పాటే కొనసాగింది కూడా!
కలిసి సినిమాల్లో నటించారు, కలిసి జీవించారు కూడా! మరి ఏమైందో కానీ కొన్నాళ్ల నుంచి వీరిద్దరి బ్రేకప్ రూమర్లు మొదలయ్యాయి. ఐదారేళ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి పీటలెక్కుతారేమో అనే ఊహాగానాల నుంచి విడిపోయారనే ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది ఈ జంట. అధికారింకగా బ్రేకప్ ప్రకటనలు ఏమీ లేవు కానీ, ఈ జంట దాదాపు విడిపోయినట్టుగానే ఉంది.
అందుకు నిదర్శనంగా దిశా పాట్నీ కొత్త బాయ్ ఫ్రెండ్ తెరపైకి వచ్చాడు. కొత్తవాడంటే కొత్తవాడేమీ కాదు. దిశకు పాత పరిచయమేనట. వీరు 2015లోనే ఒకే అపార్ట్ మెంట్ లో నివసించారట. ఇతడు కూడా మోడలింగ్ ఇండస్ట్రీవాడే. వీరిద్దరూ కెరీర్ ఆరంభంలోనే సన్నిహితులయ్యారట. తామిద్దరం ఆ దశలో ఒకరికి ఒకరు బాసటగా నిలుచుకున్నట్టుగా అలెగ్జాండర్ అలెక్స్ అనే ఇతడు చెప్పుకుంటున్నాడు. ఇంతకీ దిశతో నీ సంబంధం ఏమిటంటే మాత్రం అలాంటి విషయాలను అడగొద్దని కూడా ఇతడు అనడం విశేషం.
తమ ఇద్దరి మధ్యన ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి బయటి వాళ్లకు ఉండటం ఏమిటంటూ అలెక్స్ ప్రశ్నిస్తున్నాడు. తమ ఇద్దరి మధ్యన ఎలాంటి బంధం ఉంటే.. బయటి వాళ్లకు ఎందుకని, దాని గురించి ఆరాలు తీయడం కూడా సరి కాదని అంటున్నాడు. మామూలు వాళ్లైతే ఎవరికీ ఆసక్తి ఉండదు, హీరోయిన్ కాబట్టి ఆసక్తి ఉంటుందని అలెక్స కు తెలియనిది ఏమీ కాకపోవచ్చు!
తమ బంధం ప్రేమో కాదో, చెప్పేస్తే అంతటితో అయిపోతుంది. కానీ అలెక్స్.. ఆరాలే వద్దంటూ ఊహాగానాలకే అవకాశం ఇస్తున్నాడు! పాత ఫ్రెండ్ ను దిశ కొత్త బాయ్ ఫ్రెండ్ గా మార్చిందనే రూమర్లకు అతడి మాటలతో మరింత ఆస్కారం దక్కుతోంది.