ప్రభాస్..గోపీచంద్ లతో నందమూరి బాలకృష్ణ చేసిన అన్ స్టాపబుల్ లో ఓ చిత్రమైన సంగతి నెలకొన్నట్లు తెలుస్తోంది. చాట్ షో మధ్యలో ప్రభాస్ కు అత్యంత సన్నిహితుడైన మెగా హీరో రామ్ చరణ్ వీడియో కాల్ లో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగాలో త్వరలో ఓ శుభవార్త వుంటుందనో, ప్రభాస్ శుభవార్త చెబుతాడనో చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్త వినిపిస్తున్న టైమ్ లోనే మెగాస్టార్ చిరంజీవి త్వరలో చరణ్-ఉపాసన తల్లి తండ్రులు కాబోతున్నారన్న వార్త బయటకు వచ్చింది.
అయితే చరణ్ చాట్ షో లో శుభ వార్త అన్నది దీని గురించా? లేక ప్రభాస్ త్వరలో శుభవార్త చెబుతారు అన్నది వేరేనా? అన్నది షో ఫుటేజ్ బయటకు వస్తే కానీ తెలియదు. ఇలాంటి బిట్ ఒకటి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో వుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా వున్నారు. ప్రభాస్ పెళ్లి ఒక్కటే పెండింగ్ లో వున్న శుభవార్త. అందువల్ల అలాంటిది ఏమైనా త్వరలో వుంటుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ తో సాన్నిహిత్యంగా వుంటున్నారని వార్తలు వచ్చాయి. గతంలో అనుష్కతో పెళ్లి అని తెగ గ్యాసిప్ లు వచ్చాయి. మొత్తానికి ప్రభాస్ పెళ్లి సదా వార్తల్లోనే వుంటూ వస్తోంది.