డిస్ట్రిబ్యూటర్లకు ‘చక్ర’ లాభాలు

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `విశాల్ చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో రెజీనా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం…

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `విశాల్ చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో రెజీనా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు.

ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19న  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న‌ సంద‌ర్భంగా `విశాల్ చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`ని నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. 

ఈ కార్య‌క్ర‌మంలో..యాక్ష‌న్ హీరో విశాల్ మాట్లాడుతూ  – ఈ `చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`కి మీడియానే చీఫ్ గెస్ట్‌.  డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఎంఎస్ ఆనంద‌న్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి ఈ సినిమా తీశారు. త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రి బ్యాన‌ర్‌లో మ‌రో మంచి డైరెక్ట‌ర్‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది.  నా త‌మ్ముడు వ‌రంగ‌ల్‌ శ్రీ‌ను స‌హా డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ  ఈ సినిమాతో త‌ప్ప‌కుండా ఒక జాక్ పాట్ కొడ‌తారు. ఫిబ్ర‌వ‌రి 20న అంద‌రం ఆనందంతో మరోసారి కలుద్దాం.. అన్నారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు ఎంఎస్ ఆనంద‌న్ మాట్లాడుతూ  –  “ఎక్క‌డో ఉన్న న‌న్ను ఈ స్థాయికి విశాల్‌ తీసుకువ‌చ్చారు. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే దానికి కార‌ణం విశాల్‌గారే. ఒక మంచి క‌థ‌కి ఎలాంటి టెక్నీషియ‌న్స్ తోడైతే ఒక డైరెక్ట‌ర్‌కి ‌ ఫ‌స్ట్ సినిమా ప్రాప‌ర్‌గా వ‌స్తుందో అలాంటి టెక్నీషియ‌న్స్ ని ఇచ్చారు విశాల్‌. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కూ ప్ర‌తి సీక్వెన్స్ చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది.  ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి ఆడియ‌న్ త‌ప్ప‌కుండా ఎగ్జ‌యిటింగ్‌గా ఫీల్ అవుతారు. అన్నారు. 

నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ  –  “విశాల్ అన్న గురించి నేను చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. నేను ట్రావెల్ చేసిన వ్య‌క్తుల్లో క‌ల్మ‌షం లేని వ్య‌క్తి  విశాల్ అన్న‌. ట్రైలర్ చూస్తుంటే ఒక స్పైసీ థ్రిల్ల‌ర్ మూవీ అనిపించింది. అలాగే ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనిపించింది. ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.  త‌ప్ప‌కుండా విశాల్ అన్నకెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించి హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ జ‌గ‌న్ పాల‌న‌లో ల‌బ్ధిదారులే

షర్మిల సాహసం సఫలం అవుతుందా!