''..అరె గుచ్చే గులాబీ లాగా నా గుండెలోతునే తాకినదే, అరె విచ్చే మతాబులాగా నా రెండు కళ్లలో నిండినదే… ఎవరె నువ్వె ఏం చేసేనావె..ఎటుగా నన్నే లాగేసినావె'' ఇలా రాసుకుంటే పోతే మొత్తం పాట అంతా రాసేయాలి.
ఎందుకంటే ఈ పాట లిరిక్స్ అంత అందంగా కొత్తగా వున్నాయి. అనంత్ శ్రీరామ్, రాసిన ఈ పాటకు గోపీసుందర్ కొత్తగా వినిపించే బీట్ తో మాంచి ట్యూన్ అందించారు. దానికి తగినట్లే ఆర్మాన్ మాలిక్ ఆలాపన తోడయింది.
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తయారవుతున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన మనసా మనసా పాట విడుదలయింది. ఇప్పుడు ప్రేమికుల రోజు కానుకా సెన్సేషన్ మ్యూజిక్ డైరక్టర్ గోపీ సుందర్ ట్యూన్ చేసిన గుచ్చే గులాబీలాగా అంటూ సాగే ఓ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేశారు
పాట విడుదల సందర్భంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ ఈ సినిమాలో అకిల్ అక్కినేని, పూజా హెగ్దేల మధ్య కెమిస్ట్రీ బాగా సెట్ అయింది, దానికి తగినట్లే వుంటుందీ పాట.
నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన గుచ్చేగులాబీ పాటను సంగీత దర్శకుడు గోపీసుందర్ అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ ట్యూన్ కి తగ్గట్లుగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ పాటను ఫుల్ రొమాంటిక్ గా విజువలైజ్ చేశారు. జూన్ 19న భారీ రేంజ్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.