హీరోయిన్లు బరువు తగ్గడం కామన్. అయితే ఉన్నఫలంగా బరువు తగ్గారంటే మాత్రం ఏదో ఉందనే అర్థం. పాయల్ రాజ్ పుత్ ఈ రెండో కేటగిరీ. 4 రోజుల కిందట పాయల్ పెట్టిన స్లిమ్ ఫిజిక్ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
జస్ట్ నెల రోజుల్లో 5 కిలోలు తగ్గి అందరికీ షాకిచ్చింది పాయల్. ఆమె ఫొటోలు దాదాపు 2 రోజల పాటు వైరల్ అయ్యాయంటే పాయల్ ఫిజిక్ ఏ రేంజ్ లో పిచ్చెక్కించిందో అర్థం చేసుకోవచ్చు.
ఎట్టకేలకు తన వెయిట్ లాస్ పై వివరణ ఇచ్చింది పాయల్. కేవలం ఓ క్యారెక్టర్ కోసమే కష్టపడి 5 కిలోలు తగ్గానని చెప్పుకొచ్చింది.
“ఓ తెలుగు సినిమా (కన్నడ రీమేక్) కోసం బరువు తగ్గాను. అందులో నాది పేదరికంలో కొట్టుమిట్టాడే అమ్మాయి పాత్ర. ఓ పాత్ర కోసం నేను బరువు తగ్గడం ఇదే తొలిసారి. నిజానికి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పట్నుంచి నేను బరువు తగ్గుతూనే ఉన్నాను. ఎందుకంటే డైట్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాను.”
ఇలా తన వెయిట్ లాస్ వెనక రీజన్ ను బయటపెట్టింది పాయల్. అంతేకాదు.. ఇంత తక్కువ టైమ్ లో ఎలా బరువు తగ్గిందో కూడా చెప్పుకొచ్చింది. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 మధ్య మాత్రమే ఆహారం తీసుకునేదట పాయల్.
దీంతో పాటు వారంలో కొన్ని రోజులు ఉపవాసం ఉండేది. వాటితో పాటు యోగా, వ్యాయామం చేసింది. అలా 30 రోజుల్లో 63 కిలోల నుంచి 58 కిలోలకు చేరుకున్నట్టు తెలిపింది పాయల్.