డాక్టర్ ను దగ్గర పెట్టుకుని డబ్బింగ్

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి…

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నిర్మాతగా ఆయనది 40 ఏళ్ళ అనుభవం. స్ట్రెయిట్ తెలుగు, డబ్బింగ్ కలిపి 45కు పైగా సినిమాలు చేశారు. 'ఆదిత్య 369' వంటి సినిమాలు తీశారు. ఇప్పుడు సరోగసీ నేపథ్యంలో కొత్త కథతో 'యశోద' తీశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నవంబర్ 11న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాతో పాటు సమంత గురించి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు మీ కోసం.

శివలెంక కృష్ణప్రసాద్: 'సమ్మోహనం' తర్వాత నేను నిర్మించిన డైరెక్ట్ సినిమా 'యశోద'. హరి, హరీష్ దగ్గర కథ విన్నాను. కొత్త పాయింట్ కావడంతో ఎగ్జైట్ అయ్యాను.

చిన్న సినిమాగా చేయాల్సిన కథను ట్రెండ్ కు అనుగుణంగా పాన్ ఇండియా సినిమాగా భారీగా చేద్దాం అనుకున్నాం. ఆ విధంగానే మార్చాం.

స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత సమంత దగ్గరకు వెళ్లాం. ఫ్యామిలీ మన్ సిరీస్ తో దేశవ్యాప్త ఇమేజ్ వున్న సమంత మా ప్రాజెక్టులోకి రాగానే సినిమా లెవెల్ మారిపోయింది. ఆ తరువాత మిగిలిన ప్రముఖ నటులంతా సీన్ లోకి వచ్చారు.

సమంత స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి 'యశోద'తో ట్రావెల్ చేశారు. 'శాకుంతలం' పూర్తి కావడంతో ఫోకస్ మొత్తం సినిమాపై పెట్టారు. షూటింగ్ టైమ్‌లో బాధ్యతగా ప్రతి విషయాన్ని చూసుకున్నారు.

సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాకు డబ్బింగ్ టైమ్‌లో మాకు సమంత హెల్త్ గురించి తెలిసింది. తెలుగు డబ్బింగ్ చెప్పారు. తమిళంలో చెప్పే టైమ్‌కు ఎనర్జీ లెవల్స్ తగ్గాయి. వేరే వాళ్ళతో చెప్పించవచ్చని అన్నాను. తమిళంలో తన వాయిస్ అందరికీ తెలుసని ఆవిడే చెప్పారు. హిందీలో చిన్మయి చెప్పారు. మూడు నాలుగు రోజులు డాక్టర్‌ను దగ్గర పెట్టుకుని సమంత డబ్బింగ్ చెప్పారు. ఆవిడ డిడికేషన్‌కు హ్యాట్సాఫ్.

సినిమా బావుంటే ప్రేక్షకులు చూస్తారు. కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ టైమ్ విడుదలకు ముందు నాకు ఈ సినిమా కంఫర్ట్ లెవల్ లోకి వచ్చింది. రిలీజ్ తర్వాత కూడా కంఫర్టబుల్ గా ఉంటాను.

ఇప్పుడు ఆస్పత్రులు ఫైవ్ స్టార్ రేంజ్‌లో ఉంటున్నాయి. అటువంటి ఆసుపత్రిలో షూటింగ్ చేయాలి. పైగా, మేం కరోనా మూడో వేవ్ సమయంలో షూటింగ్ చేశాం. ఆసుపత్రికి వెళితే అక్కడ ఇబ్బంది ఉండొచ్చు. అందుకని, సెట్స్ వేశాం. 55 రోజులు ఆ సెట్స్ లో షూటింగ్ చేశాం. ఆర్ట్ డైరెక్టర్ అశోక్ అద్భుతమైన సెట్స్ వేశారు.

సినిమా చూసి సెన్సారు వాళ్లు ఎగ్జయిట్ అయ్యారు. చాలా మంది ప్రశంసించారు.

ఏపీ, తెలంగాణలో ఆసియన్ సునీల్ పంపిణీ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో యూఎఫ్ఓ, కర్ణాటకలో డిస్నీ వాళ్ళ ద్వారా చేస్తున్నాం. తమిళ్, మలయాళంలో సూర్య కంపెనీ ద్వారా చేస్తున్నాం. సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది.

సీన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది. మంచి చెడులు ఉండటం లేదు. ప్రేక్షకులు తోక్కేస్తున్నారు. కాంబినేషన్స్ మీద కాకుండా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలు కాన్సంట్రేషన్ చేస్తున్నారు.