సమంత ఒంటిపై ఇంకా ఆ సీక్రెట్ పచ్చబొట్టు ఉందా?

హీరోయిన్ సమంతకు ఇప్పటికే మణికట్టు వెనక ఓ పచ్చబొట్టు ఉంది. దాని కథాకమామిషు మొత్తం అందరికీ తెలిసిందే. ఓ సందర్భంలో సమంత కూడా ఆ టాటూ వెనక స్టోరీని బయటపెట్టింది. కానీ సమంతకు ఈ…

హీరోయిన్ సమంతకు ఇప్పటికే మణికట్టు వెనక ఓ పచ్చబొట్టు ఉంది. దాని కథాకమామిషు మొత్తం అందరికీ తెలిసిందే. ఓ సందర్భంలో సమంత కూడా ఆ టాటూ వెనక స్టోరీని బయటపెట్టింది. కానీ సమంతకు ఈ పచ్చబొట్టు మాత్రమే కాదు, సీక్రెట్ ప్లేస్ లో మరో టాటూ కూడా ఉంది. ఆ టాటూకు అర్థమేంటనే విషయాన్ని కూడా ఆమధ్య ఆమె బయటపెట్టింది.

ఓ బేబీ సక్సెస్ టైమ్ లో ఈ పచ్చబొట్టును బయటపెట్టింది సమంత. పక్కటెముకలకు కాస్త పైన దీన్ని పొడిపించుకుంది. “ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం” అంటూ ఈ స్టిల్ ను గతంలో రిలీజ్ చేసింది సమంత. ఇంతకీ ఈ పచ్చబొట్టులో ఉన్నదేంటో తెలుసా.. చై అని రాసిన పదం మాత్రమే.

కట్ చేస్తే.. అప్పటి మాటలన్నీ ఇప్పుడు చెదిరిపోయాయి. స్టేట్ మెంట్స్ అన్నీ నీటిమూటలయ్యాయి. ప్రేమ ఓ భ్రమగా మారింది. సమంత ప్రపంచం మారిపోయింది. మరి ఈ పచ్చబొట్టు పరిస్థితేంటి? సమంత సీక్రెట్ ప్లేస్ లో ఇప్పటికీ అది ఉందా? లేక సమంత దాన్ని చెరిపేసుకుందా?

తాత్కాలికంగా వేసిన టాటూ కొన్ని రోజులకు పోతుంది. కానీ సమంత వేయించుకున్న ఈ ''చై'' అనే అక్షరం మాత్రం పర్మినెంట్ టాటూ. దీన్ని తుడిపేసుకోవాలంటే చాలా శ్రమపడాల్సి వస్తుంది. దాదాపు ఓ ప్లాస్టిక్ సర్జరీ లాంటిదే జరగాలి.

అందంగా టాటూలు వేసే బ్యాచ్ తో పాటు.. ఇలా పచ్చబొట్లను చెరిపేసే వైద్యసిబ్బంది కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు, కొంతమంది కోలీవుడ్ తారలు ఇలానే తమ ఒంటిపై ఉన్న పచ్చబొట్టుల్ని సక్సెస్ ఫుల్ గా తుడిపేసుకొని గత జ్ఞాపకాల్ని మరిచిపోయాం అంటూ కవర్ చేసుకున్నారు.

సో.. సమంతకు కూడా ఇది పెద్ద పని కాదు. పచ్చబొట్టు చెరిగిపోదులే అనేది పాత పాట.. ఏదైనా మార్చేసెయ్ అనేది ఇప్పుడు కొత్త సాంగ్.