డబుల్ ఇస్మార్ట్ – సింగిల్ స్టాండర్డ్

పూరి జగన్నాధ్- రామ్ పోతినేని కాంబో సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చింది. ఆ ఇద్దరి ఫ్యాన్స్ దీని కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ పూరి నుంచి మాత్రం యావరేజ్ కంటెంట్…

పూరి జగన్నాధ్- రామ్ పోతినేని కాంబో సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చింది. ఆ ఇద్దరి ఫ్యాన్స్ దీని కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ పూరి నుంచి మాత్రం యావరేజ్ కంటెంట్ వచ్చింది.

టీజర్ కు ఓ లైన్ లో వెళ్లలేదు. మ్యాడ్ నెస్ అనే యాంగిల్ పెట్టుకుని, రకరకాల షాట్ లు కట్ చేసి వేసారు. వాటి మధ్యలో ఆలీ షాట్ లు జోడించారు. ఈ ఆలీ కామెడీ ట్రాక్ ను ఈ మధ్యనే సెపరేట్ గా చిత్రీకరించి, సినిమాకు యాడ్ చేసారని టాక్ వుంది. అది వేరే సంగతి.

ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే డబుల్ ఇస్మార్ట్ వుంటుంది. ఎందుకంటే సీక్వెల్ కాబట్టి. దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ క్వాలిటీ డబుల్ లెవెల్ లో వుండాలి. అది మిస్ అయింది. ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది. కానీ సినిమాలో లైనూ లెంగ్తూ వుంటుందేమో కానీ టీజర్ లో లేదు. మాఫియా లెవెల్ లో టీజర్ స్టార్ట్ అయింది. లోకల్ ఫ్లావర్ తో ముందుకు సాగింది. ఆపై భారీగా జనంతో డివోషనల్ టచ్ అన్నట్లు ట్రయ్ చేసారు. ఇవన్నీ ఎప్పుడు ఇలా వుంటాయి అంటే ఏ కంటెంట్ తో ముందకు వెళ్లాలి అనే క్లారిటీ లేనపుడు.

ఆలీ ట్రాక్ ప్యాచప్ గా తెలిసిపోతోంది. మరోసారి గతంలో పూరి సినిమాల్లో ఆలీ ట్రాక్ లను దృష్టిలో పెట్టుకుని చేసినట్లు అర్థం అయిపోతోంది. టీజర్ మొత్తం రామ్, సంజయ్ దత్ ల మీదే వెళ్లింది. దాంతో హీరోయిన్ క్యారెక్టర్ రొటీనే అని క్లారిటీ వచ్చింది. లైగర్ తరువాత పూరి దాదాపు 60 నుంచి 70 కోట్ల ఖర్చుతో తీసిన సినిమా. ఎలా వుంటుందో మరి.