మొన్నటివరకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై అనుమానాలుండేవి. ఆమధ్య దిల్ రాజు చేసిన ప్రకటనే దీనికి కారణం. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ తర్వాత మరో సినిమా రాబోతోందని, ఆ సినిమాను తనే నిర్మిస్తానని, వచ్చే ఏడాది మొదలవుతుందని స్పష్టంగా ప్రకటించాడు దిల్ రాజు.
దీంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రావాల్సిన సినిమాపై అనుమానాలు మొదలయ్యాయి. కొరటాల శివతో చేస్తున్న దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా ఏడాది కేటాయించడంతో, ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ ప్రాజెక్టు లేట్ అవుతుందని అంతా భావిస్తున్న టైమ్ లో క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
మార్చి వరకు దేవర సినిమా పని మీద ఉంటాడు ఎన్టీఆర్. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఈ రెండూ పాన్ ఇండియా ప్రాజెక్టులే. గతంలో తారక్-ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి చాలా టైటిల్స్ తెరపైకొచ్చాయి. అయితే అవేవీ కాదంటూ నీల్, ఆమధ్య క్లారిటీ ఇచ్చాడు.