ఎన్టీఆర్ నా- టీడీపీ నా- సినిమానా? రాజకీయమా?

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీ కార్యక్రమం తలపెట్టారు. సినిమా జనాలు మొత్తం తరలివస్తున్నారు అంటూ హడావుడి రెండు మూడు రోజుల ముందు నుంచే మొదలయింది.  Advertisement ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఈ…

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లో భారీ కార్యక్రమం తలపెట్టారు. సినిమా జనాలు మొత్తం తరలివస్తున్నారు అంటూ హడావుడి రెండు మూడు రోజుల ముందు నుంచే మొదలయింది. 

ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఈ సభ వెనుక అన్నీ తానై వున్నారు. అయితే సభా సమయం దగ్గరకు వచ్చిన తరువాత ఒక్కొక్క పేరు వెనక్కు వెళ్తోంది. ప్రభాస్ రావడం లేదు. మనవడు ఎన్టీఆర్ రావడం లేదు. అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కారణం. పవన్ కళ్యాణ్ కూడా రావడం అనుమానమే అని వినిపిస్తోంది.

అసలు సభనా? కార్యక్రమమా? రాజకీయమా? ఇదంతా ఏమిటి?

ఎన్టీఆర్ శతజయంతి అన్నపుడు దీన్ని నేరుగా ఏ శిల్పాకళావేదిక పైనో చేసుకోవచ్చు. కానీ బహిరంగ సభ మాదిరిగా అది కూడా కూకట్ పల్లిలో ఏర్పాటు చేసారు. కూకట్ పల్లి అంటే, తెలుగుదేశం పార్టీతో, దాని మూలాలున్న సామాజిక వర్గంతో వున్న అనుబంధం తెలిసిందే. అసలే ఎన్నికల సంవత్సరం. తెలంగాణలో వున్న ఆంధ్ర హీరోలు అంతా ఎవరి లిమిట్స్ లో వాళ్లు వుండాలనుకుంటారు. శిల్పాకళావేదిక లేదా ఫంక్షన్ హాల్ లో చేస్తే అది ఎలా వుండేదో, బహిరంగ సభగా చేయడంతో ఇప్పుడు దాని కాన్సెప్ట్ అర్థం కావడం లేదు.

సభకు వచ్చి ఎన్టీఆర్ అంత గొప్ప, ఇంత గొప్ప అని కొత్తగా ఏం మాట్లాడతారు? వచ్చే జనం కేవలం హీరోలను చూడడం కోసం వస్తారు. ఇప్పుడు ట్రెండ్ లో వున్న హీరోలు అంతా ఎన్టీఆర్ జనరేషన్ ను పెద్దగా చూడని వారు. ఏం చెప్పగలరు? కాస్త అటు అయితే మొన్న రజనీ కాంత్ టార్గెట్ అయినట్లు అయిపోతారు. ఎందుకొచ్చిన తలనొప్పి అని ఎవరికి వారు నైస్ గా తప్పించుకుంటున్నట్లు కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా ఇండస్ట్రీ అంతా తమ వెనుక వుంది అని చెప్పడానికి ఈ సభ ప్లాన్ చేసినట్లు వుందని ఇండస్ట్రీ జనాలే కామెంట్ చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ తరపున చేయాలనుకుంటే ప్రసన్నకుమార్ లాంటి వాళ్లకి బాధ్యతలు అప్పగించి వుంటే వేరుగా వుండేదేమో? 

ఇప్పటికే ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం వివాదానికి దారి తీసింది. తెరాస లో వుంటూ పువ్వాడ అజయ్ ఈ విగ్రహం బాధ్యత తీసుకోవడం తెలంగాణ వాదుల్లో, అభిమానుల్లో కాస్త అసంతృప్తి కలిగించింది. కేసీఆర్ ఈ విషయంలో పువ్వాడను అడ్డుకోలేదని అసంతృప్తి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక కూకట్ పల్లి సభ విషయంలో ఎన్ని కామెంట్ లు వస్తాయో అన్న ఆలోచనే చాలా మంది దానికి దూరంగా వుండడానికి కారణమై వుండొచ్చు.