Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ లేనట్టే!?

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ లేనట్టే!?

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ ఎత్తేయాలి. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు 7వ తేదీ వరకు లాక్ డౌన్ అనుకున్నా.. ఆ తర్వాత కొన్ని రోజులకు షూటింగ్స్  మొదలవ్వాలి. కానీ లాక్ డౌన్ ను మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ టీజర్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అతడి అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. అవును.. ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ రావడం ఇప్పుడు అసాధ్యంగా మారింది.

ఎన్టీఆర్ టీజర్ కు సంబంధించి షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉందని ఈమధ్యే ప్రకటించాడు రాజమౌళి. పాత ప్లాన్ ప్రకారం ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ ఎత్తేస్తే, మరికొన్ని రోజులకైనా షూటింగ్స్ కు అనుమతి ఇస్తారు. ఆ వెంటనే టీజర్ కు సంబంధించిన షూట్ కంప్లీట్ చేసి, ఈనెల 20కి బర్త్ డే టీజర్ ను రెడీ చేయాలని అనుకున్నాడు రాజమౌళి.

కానీ ఇప్పుడు లాక్ డౌన్ ను 17 వరకు పొడిగించారు. లాక్ డౌన్ తర్వాత వెంటనే షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా తారక్ పుట్టినరోజు నాటికి టీజర్ రెడీ అవ్వడం అసాధ్యం. సో.. ఈసారి ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి టీజర్ వచ్చే ఛాన్స్ ప్రస్తుతానికైతే లేదు. అయితే తారక్ పుట్టినరోజుకు ఎలాగైనా టీజర్ రిలీజ్ చేయాలనేది రాజమౌళి ఆలోచన.

ప్రస్తుతం రాజమౌళి ముందున్న ఆప్షన్ ఒక్కటే. ఇప్పటికే అనుకున్న టీజర్ కాన్సెప్ట్ కు రిపేర్లు చేసి, ఉన్న ఫూటేజ్ తో మరో కొత్త టీజర్ రెడీ చేయాలి. లేదంటే.. టోటల్ గా టీజర్ ఆలోచనను పక్కనపెట్టి మరో కొత్త మెటీరియల్ (పోస్టర్ లేదా మోషన్ పోస్టర్) తో రావాలి. తారక్ పుట్టినరోజుకు ఆర్ఆర్ఆర్ నుంచి హంగామా ఉండడం గ్యారెంటీ. కాకపోతే ప్లాన్ మారుతోందంతే.

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు కాన్సెప్ట్ తో టీజర్ రిలీజ్ చేశాడు రాజమౌళి. రామ్ చరణ్ ఎలివేషన్ కు ఎన్టీఆర్ వాయిస్ఓవర్ పెట్టాడు. ఈసారి రామరాజు ఫర్ భీమ్ అనే కాన్సెప్ట్ ను ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్లాన్. చరణ్ వాయిస్ఓవర్ రెడీగా ఉంది. రాజమౌళి ఎలా చేస్తాడో చూడాలి మరి.

జగన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పిన నవీన్ పట్నాయక్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?