Advertisement

Advertisement


Home > Movies - Movie News

అట్టర్ ఫ్లాప్ అయిన సలార్

అట్టర్ ఫ్లాప్ అయిన సలార్

సలార్ హంగామా ముగిసిపోయింది. థియేటర్లలో దుమ్ముదులిపింది. ఇప్పుడు కొత్తగా అట్టర్ ఫ్లాప్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఇది సలార్ టీవీ టెలికాస్ట్ కు సంబంధించిన మేటర్. థియేటర్లలో సంచలనం విజయం సాధించిన ఈ సినిమా బుల్లితెరపై అట్టర్ ఫ్లాప్ అయింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సలార్ సినిమాను ప్రసారం చేసింది స్టార్ మా ఛానెల్. గట్టిగా ప్రచారం చేసింది. దీనిపై చాలా హోప్స్ పెట్టుకుంది. అయితే ఈ సినిమా మాత్రం నిరాశపరిచింది. సలార్ కు టీవీల్లో కేవలం 5.21 రేటింగ్ వచ్చింది. నంబర్స్ పరంగా చూసుకుంటే ఇది అట్టర్ ఫ్లాప్ రేటింగ్.

ఓ హిట్ సినిమాకు ఇంత తక్కువ రేటింగ్ రావడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. థియేటర్లలో యావరేజ్ గా ఆడిన నా సామిరంగ సినిమాకు ఇంతకంటే ఎక్కువ రేటింగ్ (6.79) వచ్చింది. ఇక థియేటర్లలో డిజాస్టర్ అయిన ఆదికేశవ లాంటి సినిమాకు కూడా ఇదే మాటీవీలో 10 రేటింగ్ వచ్చింది.

బాహుబలి-2 తర్వాత సక్సెస్ లేక ఇబ్బంది పడిన ప్రభాస్ కు ఎట్టకేలకు సక్సెస్ అందించింది సలార్ మూవీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు. త్వరలోఈ సినిమా పార్ట్-2 షూటింగ్ మొదలుకాబోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?