గంగమ్మ జాతరలో శివాలెత్తిన పుష్ప

పుష్ప-2 ది రూల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై స్పందించాడు. సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే సన్నివేశం గురించి…

పుష్ప-2 ది రూల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై స్పందించాడు. సినిమా మొత్తానికి హైలెట్ అయ్యే సన్నివేశం గురించి మాట్లాడాడు.

పుష్ప-2లో గంగమ్మ జాతర ఎపిసోడ్ ఉంది. అందులో గంగమ్మ తల్లిగా కనిపించబోతున్నాడట అల్లు అర్జున్. ఆ ఎపిసోడ్ టోటల్ సినిమాకే హైలెట్ అవుతుందని చెబుతున్నాడు దేవిశ్రీ. ఆ ఎపిసోడ్ లో బన్నీ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందని అంటున్నాడు.

గంగమ్మ జాతరకు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ కోసం భారీ సెట్ వేశారు. వందల మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఈ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. గంగమ్మ జాతరకు సంబంధించి బన్నీ గెటప్ ను ఇదివరకే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పుష్ప సినిమాలో సాంగ్స్ గురించి ఇదివరకే స్పందించాడు అల్లు అర్జున్. 'ఊ అంటావా మామ..' అనే ఐటెంసాంగ్ వెనక గమ్మత్తైన విషయాన్ని కూడా బయటపెట్టాడు. ఇప్పుడు పుష్ప-2 మ్యూజిక్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని, మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ లో బీజీఎం అదిరిపోతుందని ఊరిస్తున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ మూవీ. పుష్ప-1 ఆల్రెడీ దేశవ్యాప్తంగా పెద్ద హిట్టవ్వడంతో, పార్ట్-2పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, చాలా గ్యాప్ తీసుకొని, స్క్రీన్ ప్లేపై బాగా వర్కవుట్ చేసింది యూనిట్. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తుంది పుష్ప-2.