చూస్తుంటే కల్కి సినిమా రోజురోజుకి మరింత పెద్ద ప్రాజెక్టుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కి రీసెంట్ గా కమల్ హాసన్ ఎంటరైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మెగా మూవీలోకి నటుడు దుల్కర్ సల్మాన్ కూడా అడుగుపెట్టినట్టు కనిపిస్తోంది.
తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా మాట్లాడిన దుల్కర్.. కల్కి సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కల్కి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నాడు. తను సెట్స్ కు వెళ్లానని చెప్పిన దుల్కర్.. కల్కిలో తను నటిస్తున్నానా లేదా అనే విషయాన్ని మాత్రం అప్పుడే బయటపెట్టనంటున్నాడు.
దుల్కర్ మాటలు చూస్తుంటే.. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో అతడు కూడా ఉన్నట్టున్నాడు. కాకపోతే ఓ మంచి రోజు, టైమింగ్ చూసి ఈ విషయాన్ని మేకర్స్ ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.
కల్కి సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం ఉంది. ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. కీలక పాత్రలో దిశా పటానీ కనిపించనుంది. మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఇక విలన్ రోల్ కోసం కమల్ హాసన్ ను తీసుకున్నారు. ఇప్పుడు దుల్కర్ చేరికతో ఇది మరింత బిగ్ ప్రాజెక్టుగా మారుతుంది.
రెండు భాగాలుగా రాబోతోంది కల్కి సినిమా. తను మొదటి పార్టులో కంటే, రెండో భాగంలో ఎక్కువగా కనిపిస్తానని కమల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బహుశా, దుల్కర్ కూడా రెండో భాగంలో కనిపిస్తాడేమో.