మంత్రి అంబటి రాంబాబు ఓకే ట్వీట్‌తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌లకు గాలి తీసి పడేశారు. 'బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. కానీ …గద్దెనెక్కడం అసాధ్యం!' అంటూ మళ్లీ చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదని ఎద్దేవా చేశారు.
గత నెల రోజులుగా చంద్రబాబు, తన ఇద్దరి పుత్రులు(దత్త పుత్రుడును కలుపుకొని) రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నారా లోకేష్ పాద యాత్రకు పబ్లిసిటికి ఇబ్బంది లేకుండా పగలంతా స్టార్ హోటల్స్‌లో సమావేశాలు పెట్టుకుంటూ.. రాత్రులు మాత్రం బస్సు ఎక్కి పవన్ మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు కూడా లోకేష్ ఇప్పటికే తిరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతూ రాజకీయ వేడిని సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి ముగ్గురికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
కాగా ఇటీవల విడుదల అయిన బ్రో సినిమా రచ్చలో సినిమా కంటే అంబటి వ్యాఖ్యల గురించే చర్చ మొత్తం నడిచింది. పవన్‌కు సపోర్టుగా పాదయాత్రలో లోకేష్, చంద్రబాబులు కూడా అంబటిపై విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. మొత్తానికి పవన్ లారీ యాత్ర, బాబు బస్సు యాత్ర, లోకేష్ పాదలపై నడిచే పాదయాత్ర వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం లేదని అంబటి కామెంట్లు చేశారు.
మరోవైపు ఆంధ్రలోని అన్నీ రాజకీయ పార్టీల అధినేతలు ప్రజ క్షేత్రంలో ఉండి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నా.. వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి మాత్రం బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో తప్పా ఎక్కడ కనపడటం లేదు.