టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతోంది.
ఈ సమావేశానికి గిల్డ్ సభ్యులైన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంతా హాజరు కాబోతున్నారు. ఆగస్టు 1 వ తేదీ నుంచి సినిమా నిర్మాణాలు అన్నీ ఆపాలన్న కీలక నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకోబోతున్నారు.
ఇప్పటి వరకు డిస్కషన్లు అయ్యాయి. కౌన్సిల్, చాంబర్ ల్లో కూడా చర్చలు జరిగాయి. కౌన్సిల్, చాంబర్ ఈ సినిమాలు ఆపాలన్న నిర్ణయానికి వ్యతిరేకమైనా చేసేదేమీ లేదు.
ఎందుకంటే అందులో యాక్టివ్ గా సినిమాలు నిర్మించే వారు ఎవరూ పెద్దగా లేరు. అందువల్ల గిల్డ్ నిర్ణయం తీసుకుంటే దాదాపుగా టాలీవుడ్ షూటింగ్ లు అన్నీ ఎక్కడివక్కడ ఆగిపోతాయి.
ఆగస్టు 15 నుంచి సెట్ మీదకు వెళ్లాల్సిన మహేష్ సినిమా ఆగుతుందా లేదా అన్నది చూడాలి. అప్పటి వరకు ఈ సమస్య వుంటే ఆగాల్సిందే. బాలయ్య టర్కీలోనూ, వరుణ్ తేజ్ లండన్ లోనూ షూట్ కు వెళ్లాల్సి వుంది. అవి కూడా ఆగుతాయని వినిపిస్తోంది. ఇంకా చాలా సినిమాలు ఆగే అవకాశం వుంది.