ఈ రూమర్లు ఎవరి పని?

ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. ఆంధ్రలో పాక్షికంగా లాక్ డౌన్ విధించారు అంటూ. అలా అని జ‌స్ట్ సింగిల్ లైన్ మెసేజ్ కాదు. చాలా డిటైల్డ్ గా. ఏయే సంస్థలకు ఏయే నిబంధనలు…

ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం. ఆంధ్రలో పాక్షికంగా లాక్ డౌన్ విధించారు అంటూ. అలా అని జ‌స్ట్ సింగిల్ లైన్ మెసేజ్ కాదు. చాలా డిటైల్డ్ గా. ఏయే సంస్థలకు ఏయే నిబంధనలు అంటూ చాలా డిటైల్డ్ గా. ఈ మెసేజ్ ఇటు వాట్సాప్ ల్లో, ఇంకా వివిధ సామాజిక మాధ్యమాల్లో తిరిగేసింది. ఇదే నిజం అనుకుని కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా దాన్ని ప్రసారం చేసాయి.

కానీ వాస్తవం కనుక్కుంటే ఆంధ్రలో అలాంటి నిర్ణయాలు ఏవీ వెలువడలేదని తేలింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనే లేదని ఆంధ్ర ఆరోగ్యశాఖ నుంచి వివరణ దొరకింది. ఇదంతా కేవలం బంగార్రాజు సినిమా మీద కోపంతో కొంతమంది చేసిన పని అని కూడా అనుమానిస్తున్నారు.

ఎందుకంటే హీరో నాగ్ ఆంధ్రలో టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడారు. అలాగే సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడడం సరి కాదన్నారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను తీవ్రంగా కిర్రెక్కించాయి. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నాగ్ మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే బంగార్రాజు మార్కెట్ ను, బయ్యర్లను అయోమయంలోకి నెట్టేందుకు ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేసి వుంటారని యూనిట్ అనుమానిస్తోంది.