Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ వయసులో మోహన్ బాబుకు ఎంత కష్టం

ఈ వయసులో మోహన్ బాబుకు ఎంత కష్టం

వయసు మీద పడిన తరువాత కుటుంబం, పిల్లలు, పరువు ఇవే అసలు బంధాలుగా మిగులుతాయి. తనకంటూ, తన ఫ్యామిలీకంటూ ఓ విశిష్టత ఏర్పాటు చేసుకున్న మంచు మోహన్ బాబుకు ఈ వయసులో కాస్త పెద్ద కష్టమే వచ్చింది. 

చిరకాలంగా గుట్టుగా వున్న కుటుంబ విబేధాలు రోడ్డున పడ్డాయి. మంచు విష్ణు-మంచు మనోజ్ ల మధ్య వున్న విబేధాలు రోడ్డున పడడంతో మోహన్ బాబుకు పెద్ద కష్టమే వచ్చింది.

చిరకాలంగా మంచు ఫ్యామిలీలో మనోజ్ ఒంటరిగా వుంటూ వస్తున్నారు. కొన్నాళ్లు అక్క లక్ష్మి ఇంట్లో, మరి కొన్నాళ్లు చెన్నయ్ లో ఇలా రకరకాలుగా కాలక్షేపం చేస్తున్నారు. మోహన్ బాబు కుటుంబానికి మంచి ఆదాయ వనరులు వున్నా, ఆస్తి పాస్తులు వున్నా మనోజ్ వాటికి దూరంగానే వుంటున్నారు. అన్నీ విష్ణు నే మేనేజ్ చేస్తున్నారు. 

మోహన్ బాబు కూడా విష్ణుతోనే వున్నారు. అయినా మీడియా ఏనాడూ ఈ విషయాల జోలికి పోలేదు. ఇటీవల మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నపుడు ఈ విబేధాలు కాస్త కనిపించాయి విష్ణు పెళ్లి విషయంలో అంటీ ముట్టనట్లు వుండడం, అక్కే అంతా చేసిందని మనోజ్ పదే పదే మెచ్చుకోవడంతో ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమథింగ్ అని గుసగుసలు వినిపించాయి.

ఇప్పుడు మరి ఏమయిందో మోహన్ బాబుకు బంధువు వరుస అయిన సారథితో మంచు విష్ణు గొడవ పడ్డారని వార్తలు బయటకు వచ్చాయి. సారథి చిరకాలం మోహన్ బాబు దగ్గరే వుండేవారు. ఇప్పుడు మనోజ్ దగ్గర వుంటున్నారు. 

విష్ణు-సారథిపై దాడి చేయడం, మనోజ్ అది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మళ్లీ డిలీట్ చేయడంతో, మొత్తం మీడియా ఫోకస్ అంతా మంచు ఫ్యామిలీ మీదకు వెళ్లిపోయింది. ఇండస్ట్రీ లో ఓ గౌరవమైన స్థానంలో వున్న మోహన్ బాబుకు ఇదంతా కాస్త మనస్తాపం కలిగించే వ్యవహారమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?