Advertisement

Advertisement


Home > Movies - Movie News

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న న‌టి!

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న న‌టి!

తెలుగులో పలు సీరియల్స్‌, టీవీ షోల్లో నటించి మెప్పించిన ప్ర‌ముఖ న‌టి ప్రియాంక న‌ల్కారి, త‌న ప్రియుడు రాహుల్ వ‌ర్మ‌ను సీక్రెట్ గా మ‌లేషియాలో వివాహ‌మాడారు. మలేషియాలోని మురుగన్‌ ఆలయంలో వీరి వివాహం జరిగిన‌ట్లు తెలుస్తోంది.

2010లో విడుద‌లైన అంద‌రి బంధువ‌యా సినిమాతో న‌టిగా ప‌రిచ‌మ‌యైన ప్రియాంక‌.. స‌హాయ న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కిక్ 2, హైప‌ర్, నేనే రాజు నేనే మంత్రి, స‌మ్ థింగ్, కాంచ‌న 3 త‌దిత‌ర సినిమాల‌తో పాటు ప‌లు సీరియ‌ళ్లలో న‌టించారు. ప్రియాంక నటించిన తమిళ్‌ సీరియల్‌ రోజా కు మంచి టీఆర్పీ రావడంతో అక్కడే మంచి ఆవ‌కాశ‌లు రావ‌డంతో చైన్నెలో సెటిలైంది.

ప్రియాంక భ‌ర్త రాహుల్ వర్మ కూడా ప‌లు సీరియ‌ళ్లో న‌టించారు. అప్పుడే వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాహుల్ వ‌ర్మ వ్యాపార‌వేత్త‌గా మలేషియాలో స్థిర‌పడిన‌ట్లు తెలుస్తోంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?