హిందీ వెబ్ సీరిస్ లలో సంచలనం రేపింది లస్ట్ స్టోరీస్. చాలా హాట్ హాట్ సీన్లతో దుమారం రేపారు దాని రూపకర్తలు. అయితే పరిమితమైన ప్రేక్షక గణానికి మాత్రమే చేరువ కావడంతో దానిపై పెద్దగా రాద్ధాంతం జరగలేదు.
ఆ సంగతలా ఉంటే ఇప్పుడు తెలుగులో లస్ట్ స్టోరీస్ ను రూపొందించబోతున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడా పలువురు ప్రముఖ దర్శకులు లస్ట్ స్టోరీస్ ను వెబ్ సీరిస్ ను రూపొందించనున్నారని అధికారిక ప్రకటనలు వస్తున్నాయి. అందులో నటించే నటీమణుల పేర్లు కూడా వెల్లడి అవుతున్నాయి.
ఇప్పటికే అమలపాల్, ఇషా రెబ్బల పేర్లు ఈ విషయంలో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇషా స్పందించింది. తను లస్ట్ స్టోరీస్ తెలుగు వెర్షన్లో నటించబోతున్న విషయం నిజమే అని ఆమె అంటోంది. అయితే ఈ విషయం చెప్పగానే చాలా మంది కియారా అద్వానీ నటించిన ఎపిసోడ్స్ గురించి గుర్తు చేసుకుంటున్నారని ఇషా అంటోంది.
అయితే తను అందులో నటించడం లేదని ఈమె చెప్పింది. అసలుకు హిందీ లస్ట్ స్టోరీస్ కు, తెలుగు లస్ట్ స్టోరీస్ వెబ్ సీరిస్ కు ఏ మాత్రం సంబంధం లేదని అంటోంది. కేవలం టైటిల్ మాత్రమే కామన్ అని, కథంతా మారిపోతుందని ఇషా చెబుతూ ఉండటం గమనార్హం!
బాలీవుడ్ డోస్ లస్ట్ ఇక్కడ ఉండదన్నట్టుగా ఈ నటీమణి చెబుతోంది. ఇక తన ఫొటో షోస్ గురించి ఇషా స్పందించింది. తను ప్రత్యేకంగా హాట్ గా కనిపించడానికి ఆ ఫొటో షోస్ నిర్వహించడం లేదని, తను ఎప్పుడూ హాటే అని ఇషా చెబుతోంది!