ఎక్కడికి..టు డిస్కోరాజా

టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం ఇలా వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్న దర్శకుడు విఐ ఆనంద్. ఆయన లేటెస్ట్ సినిమా డిస్కోరాజా. ఆయన మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు ఓ…

టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం ఇలా వరుసగా మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్న దర్శకుడు విఐ ఆనంద్. ఆయన లేటెస్ట్ సినిమా డిస్కోరాజా. ఆయన మిగిలిన సినిమాలకు ఈ సినిమాకు ఓ పోలిక, ఓ తేడా వుంది. ఎప్పటి లాగే విభిన్నమైన సబ్జెక్ట్ తీసుకుని చేస్తున్నారు. అది పోలిక. తొలిసారి ఓ మాస్ హీరోతో, పెద్ద బడ్జెట్ తో, తన విభిన్నమైన సబ్జెక్ట్ కు మాస్ టచ్ యాడ్ చేసి సినిమా చేస్తున్నారు. అదీ తేడా. ఈ నేపథ్యంలో మీడియాతో ఆయన మాటలు. 

ఆనాటి అడ్వాన్స్..ఈనాటి ప్రాజెక్టు

డిస్కోరాజా సినిమా ఐడియా రాకముందే రామ్ తాళ్లూరి నాకు ఎక్క‌డికి పోతావే చిన్న‌వాడా టైమ్ లో అడ్వాన్స్ ఇచ్చారు. ఒక్క‌క్ష‌ణం మూవీ చేసి వ‌చ్చేస‌రికి వాళ్ళు నేల‌టికెట్ సినిమాని చేస్తున్నారు.  ఆ మూవీ షూటింగ్ స్పాట్‌కి తీసుకెళ్ళి బ్రెక్ టైంలో లైన్ అడిగితే చెప్పాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చి వెంట‌నే ఫుల్ నెరేషన్ ఇవ్వ‌మ‌ని అడిగారు. ఒన్ వీక్‌లో ఇవ్వ‌గానే. అప్ప‌టి నుంచి ఇంక ఈ సినిమాప‌నులు మొద‌ల‌య్యాయి. టేక్ ఆఫ్ అనేది అలా చాలా స్మూత్‌గా జ‌రిగింది. 

మూడు వందల మంది క్రూ

దాదాపుగా మొత్తం మూడు వంద‌ల మంది ఈ సినిమా కోసం ప‌ని చేశారు. అందులో మెయిన్ ఆర్టిస్టులు ఒక 20 మంది ఉంటారు. 

ఐస్ ల్యాండ్ ఎపిసోడ్

ఐస్‌ల్యాండ్‌కి మినిమం ఒక 20మంది క్రూతో వెళ్లాం. ఐస్‌ల్యాండ్ ఒక్క‌టే అవుట్ ఆఫ్ కంట్రీ. మిగ‌తా షూటింగ్ అంతా హైద‌రాబాద్‌, ఢిల్లీ, గోవా, చెన్నై, మ‌నాలి లో జ‌రిగింది. దాదాపు అన్ని చోట్ల 15రోజుల పాటు షూటింగ్ జ‌రిగింది. టోట‌ల్‌గా మొత్తం 90 వ‌ర్కింగ్ డేస్ వ‌స్తాయి. 

డిస్కోరాజా గెట‌ప్ 

డిస్కోరాజా క్యారెక్ట‌ర్ మొత్తం డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ స్టైల్స్ ఉంటాయి. అందులో ఆయ‌న టోపీ పెట్టుకుని వ‌చ్చే గెట‌ప్ బావుంటుంది. డిస్కోరాజా క్యారెక్ట‌రే ఈ మూవీలో ప్రధానం.  అదే నా ఫేవ‌రెట్‌. ఒక మ్యూజిక్ ల‌వ‌ర్ క్యారెక్ట‌ర్‌ని ఆయ‌న ఓన్‌చేసుకుని చెయ్య‌డం అనేది నెక్స్‌ట్ లెవ‌ల్‌కి తీసుకువెళ్లిపోయింది. 

సునీల్‌, స‌త్య గెట‌ప్‌లు 

వీరిద్ద‌రివి చాలా ఇంట్ర‌స్టింగ్ క్యారెక్ట‌ర్స్ స‌త్య‌ది ఒక ఎగ్రెసివ్  క్యారెక్ట‌ర్. ఆయ‌న క్యారెక్ట‌ర్ పేరు ఫిలిప్‌. సునీల్  చాలా సాఫ్ట్‌ క్యారెక్ట‌ర్ ఆయ‌న పేరు ఉత్త‌ర కుమార్‌. ఫిలిప్‌, ఉత్త‌ర‌కుమార్ వీరిద్ద‌రి క్యారెక్ట‌ర్స్ సినిమాలో మంచి కామెడీ, ఫ‌న్‌ని క్రియేట్ చేస్తాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. 

రెట్రో లుక్..అట్మాస్ఫియర్

చాఫ్ కాస్ట్యూమ‌ర్ వాసు ఆల్‌మోస్ట్ ఎక్స్‌పీరియ‌న్స్‌డ్‌. రెట్రో స్టార్ట్ చెయ్యాలంటే ఒక‌వంద మంది క్రౌడ్ ఉండాలంటే… వాళ్ళు ముందు కాస్ట్యూమ్స్ రెడీ చేసుకోవాలి. ఒక 60 విగ్‌లు రెడీ చేసుకోవాలి. క్రౌడ్ ఇంపార్టెంట్‌. ఈ ప్రి ప్రొడ‌క్ష‌న్ అంతా మూడు నెల‌ల ముందు నుంచే మొద‌ల‌యింది. ఆ త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రికి నేను స్కెచ్చింగ్ చేశాను. హీరోగారికి హ‌ర్ష అనే డిజైన‌ర్ చాలా బాగా చేశారు. హీరోయిన్లు అంద‌రికీ ఆయేషా అనే అమ్మాయి చాలా బాగా చేసింది. ఇదంతా ఒక ప‌క్క‌న పెడితే కాస్టూమ‌ర్ వాసు అన్ని క్యారెక్ట‌ర్స్‌కి చాలా బాగా డిజైన్ చేశారు. 

అబ్బూరి డైలాగులు

అబ్బుర‌విగారి ఇది నా నాలుగో చిత్రం. టైగ‌ర్‌, ఒక్క‌క్ష‌ణం, ఎక్క‌డికిపోతావే చిన్న‌వాడ త‌ర్వాత ఈ మూవీ చేస్తున్నా. మా ఇద్ద‌రికి  బాగా కుదిరింది. ఆయ‌న వేవ్‌లెంగ్త్ నాకు బాగా తెలుసు. నా ప్ల‌స్ మైన‌స్ ఆయ‌న‌కి తెలుసు సో..ఆయ‌న ఒక మూడు నెల‌ల పాటు తీసుకుని డైలాగ్స్ రాసి మొత్తం న్యారేష‌న్ ఇచ్చారు. మాకు బాగా సెట్ అయింది. అందులో పాత్ర‌కి త‌గ్గ‌ట్లే ప్ర‌తి డైలాగ్‌ని రాశారు. ర‌వితేజ‌గారు క్యారెక్ట‌ర్‌లో వ‌చ్చిన డైలాగ్స్ మాత్ర‌మే కాకుండా స్పాంటినూస్‌గా కొన్ని చెప్పారు అవి చాలా బాగా వ‌చ్చాయి. 

బాబి సింహా యంగ్‌, ఓల్డ్ గెటప్ లు

ఆయ‌న రెట్రోలో ఉన్నారు. క‌రెంట్‌లో ఉన్నారు. ఆయ‌న‌ క్యారెక్ట్‌రైజేష‌న్ చాలా ఇన్‌టెన్‌సిటీ క్యారెక్ట‌ర్. ఆయ‌న క్యారెక్ట‌ర్ విల‌న్ అనేకంటే హీరోకి ఛాలెంజింగ్ చేసిన ఒక క్యారెక్ట‌ర్ అనే చెప్పాలి. బాగా డెప్త్ ఉన్న క్యారెక్ట‌ర్‌. చెన్నై గ్యాంగ్‌స్ట‌ర్‌లో ఉన్న ఒక క్యారెక్ట‌ర్ ఆయ‌న పేరు బ‌ర్మ సేథు. ఆస్టైల్లో విల‌న్ ఉండాల‌ని నేను క్యారెక్ట‌ర్ రాసేట‌ప్పుడే బాబీసింహాను ఊహించుకుని రాశాను. ఆయ‌న యంగ్ ఓల్డ్ క్యారెక్ట‌ర్‌తో మెప్పించ‌గ‌ల‌ర‌ని జిగ‌ర్తాండాతో నిరూపించుకున్నారు. అలాగే నాకు ఆయ‌న ఓల్డ్ క్యారెక్ట‌ర్‌లో ర‌జ‌నీకాంత్ లాగాక‌నిపించాల‌ని నా కోరిక సేధులో ర‌జ‌నీకాంత్ ఉండాల‌నే ఫీల్ నాకు వచ్చింది. దాని వ‌ల్ల బాబి సింహా క‌రెక్ట్‌గా సెట్ అయ్యారు. 

త‌మ‌న్ మ్యూజిక్?

త‌మ‌న్ ఫామ్‌లో ఉన్న బ్యాట్స్ మెన్‌. ప్ర‌స్తుతం ఆయ‌న మంచి ఫ్లోలో ఉన్నారు. ఆయ‌న మ్యూజిక్ అందించిన నాలుగు పాట‌లు చాలా బాగా హిట్ అయ్యాయి. ఒన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ అని చెప్పాలి. అందులో నా ఫేవ‌రెట్ 'నువు నాతో ఏమ‌న్నావో' ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్‌. ఆ సాంగ్‌కి ఎమోష‌న‌ల్‌గా అంద‌రూ కనెక్ట్ అవుతారు. ఈ మూవీలో కూడా చాలా ప్ల‌స్ అవుతుంది.  త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూప‌ర్ అనే చెప్పాలి.

రాజ్ డిస్కో రాజ్

సునీల్ టైమింగ్ కి హ్యాట్స్ ఆఫ్