ఎక్కేసింది ఎక్కేసింది అంటూ ఓ సాంగ్ వచ్చేసింది. పెప్పీ వాయిస్ వున్న రామ్ మిరియాలతో అనూప్ రూబెన్స్ ఈ పాటను మంచి రోజులు వచ్చాయి సినిమా కోసం పాడించారు.
సంతోష్ శోభన్-మెహరీన్ కాంబినేషన్ లో యువి సంస్థ నిర్మించే సినిమాకు కర్త..కర్మ..క్రియ అన్నీ దర్శకుడు మారుతినే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సోసోగా అనే సాంగ్ వచ్చి పాపులర్ అయింది. ఇప్పుడు ఇది రెండో సాంగ్.
ఈ మధ్య రామ్ మిరియాల గొంతు కాస్త ఎక్కువే వినిపిస్తోంది సినిమాల్లో. సినిమా సెకండాఫ్ లో హుషారు నింపేందుకు ఉద్దేశించిన 'ఎక్కేసింది..ఎక్కేసింది.గుండె మబ్బుల్లోకే..అంటూ సాగే ఈ పాట ప్రోమోను విడుదల చేసారు. యువి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ కలిసి నిర్మించే ఈ చిన్న సినిమాను గట్టిగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
సాంగ్ ప్రోమో కన్నా ముందుగా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రోమో కూడా ఇంట్రస్టింగ్ గా కట్ చేసారు. అనంత్ శ్రీరామ్ రాసిన పూర్తి సాంగ్ బయటకు వస్తే ఆ ఇంట్రస్ట్ ఏ మేరకు పెరుగుతుంది అన్నది చూడాలి.