ఏమైంది థమన్….బ్రో

థమన్ ట్యూన్ కడితే వ్యూస్ కురవాల్సిందే. కళావతి పాట వరకు ఇదే తంతు. కానీ ఆ తరవాత గ్రాఫ్ దిగుతోంది. మ..మ..మహేషా కానీ, మురారివా పాట కానీ శహభాష్ అనిపించలేదు.  Advertisement సరే టైమ్…

థమన్ ట్యూన్ కడితే వ్యూస్ కురవాల్సిందే. కళావతి పాట వరకు ఇదే తంతు. కానీ ఆ తరవాత గ్రాఫ్ దిగుతోంది. మ..మ..మహేషా కానీ, మురారివా పాట కానీ శహభాష్ అనిపించలేదు. 

సరే టైమ్ ఇచ్చి వుండరు. సరైన ట్యూన్ రాబట్టుకోగలిగిన సత్తా డైరక్టర్ కు లేకపోయి వుండొచ్చు అని సర్ది చెప్పుకోవచ్చు. కానీ విక్రమ్ కుమార్ లాంటి టేస్ట్ వున్న డైరక్టర్ అందిస్తున్న‌ థాంక్యూ సినిమా నుంచి పాట వచ్చింది.

చైతన్య నటించిన ఈ సినిమా నుంచి ర్యాప్ స్టయిల్ పాట వదిలారు. విశ్వ, కిట్టు విస్సా ప్రగడ అందించిన ఈ పాట ట్యూన్ ఏమంత క్యాచీగా లేదు. ర్యాప్ సాంగ్స్ అంటేనే దాదాపు అన్నీ ఒకే విధంగా వుంటాయి. 

కానీ ర్యాప్ ఆలాపన అయిపోయిన తరువాత వచ్చిన రెగ్యులర్ ట్యూన్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు. విక్రమ్ కుమార్ సినిమాల్లో పాటలు అన్నీ బాగుంటాయి. మ్యూజిక్ డైరక్టర్ ఎవరు అన్నద అక్కడ పాయింట్ నే కాదు.

కానీ థమన్ చేసాడు అది కూడా విక్రమ్ కుమార్ సినిమాకు అంటే కచ్చితంగా ఓ ఎక్స్ పెక్టేషన్ వుంటుంది. ఆ ఎక్స్ పెక్టేషన్ ను సాంగ్ రీచ్ కాలేదు. థాంక్యూ సినిమా టీజర్ బాగానే ఆక్టట్టుకుంది. తరువాత విడుదల చేసిన తొలి పాట ఇది. 

సాధారణంగా సినిమాలో వున్న మంచి సాంగ్ ను ముందుగా విడుదల చేస్తారు. ఆ విధంగా చేసారా? లేక యూత్ ఫుల్ గా వుంటుందని ముందుగా ఈ పాట విడుదల చేసారా? అన్నది మరో సాంగ్ బయటకు వస్తే తప్ప తెలియదు.