అంటే ..నానికి 15 కోట్లు

అంటే సుందరానికి సినిమా విడుదలైంది. సినిమా ఎలా వుంది…మంచి చెడ్డలు అవీ పక్కన పెడితే ఈ సినిమా వల్ల హీరో నానికి గట్టిగా గిట్టుబాటు అయిందని తెలుస్తోంది.  Advertisement ఇప్పటి వరకు తొమ్మిద..పది..పన్నెండు కోట్లు…

అంటే సుందరానికి సినిమా విడుదలైంది. సినిమా ఎలా వుంది…మంచి చెడ్డలు అవీ పక్కన పెడితే ఈ సినిమా వల్ల హీరో నానికి గట్టిగా గిట్టుబాటు అయిందని తెలుస్తోంది. 

ఇప్పటి వరకు తొమ్మిద..పది..పన్నెండు కోట్లు తీసుకుంటున్న హీరో నాని, ఈ సినిమాకు మాత్రం ఏకంగా 15 కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకున్నారట. దీనికి ఆయన కారణం ఆయనకు వుంది. ఈ సినిమా కాస్త తక్కువ బడ్జెట్ లో కంప్లీట్ అయ్యే సబ్జెక్ట్. కేవలం రెండు ఇళ్లు, ఓ కెఫే..అమెరికాలో, కేరళలో కొన్ని సీన్లు.

సినిమాకు నిర్మాణ వ్యయం పాతిక కోట్ల లోపే అయిందని తెలుస్తోంది. మార్కెట్ మాత్రం యాభై కోట్లు దాటింది. అందుకే నాని తన రెమ్యూనిరేషన్ ఈ సినిమాకు మాత్రం 15 కోట్లు తీసుకున్నట్లు పక్కాగా తెలుస్తోంది.  

ఈ సినిమా తరువాత చేస్తున్న దసరా సినిమా బడ్జెట్ 60 కోట్లు అయిపోతోంది. కానీ ఆ సినిమాకు మాత్రం అలా బడ్జెట్ ఎక్కువ అని ఆరేడు కోట్లు తీసుకోవడం లేదు. రెగ్యులర్ గా తన రెమ్యూనిరేషన్ ఎంతో అంతే తీసుకుంటున్నారు.

అంటే నిర్మాతకు డబ్బులు మిగిల్తే అయితే సినిమా మీద ఖర్చు చేయాలి. లేదా హీరోకు ఇవ్వాలి. నాని మాత్రమే కాదు టాలీవుడ్ లో హీరోలు చాలా మంది స్టయిల్ ఇదే. 

గతంలో జెర్సీ సినిమాకు కూడా ముందుగా లాభాల్లో వాటా అని, తరువాత అలా వచ్చిన వాటా రెమ్యూనిరేషన్ కు సరి తూగక పోవడంతో, మళ్లీ అదనంగా తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.