ఇద్దరూ పేరున్న దర్శకులే. పవన్ ఫ్యాన్స్ వాళ్ల సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్ల కాంబినేషన్ లో పవన్ చేయాల్సిన సినిమాలు మాత్రం అలా పడి వుంటున్నాయి.
క్రిష్ తో హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు చేయాలి. వీటిలో హరిహర వీరమల్లు చాలా వరకు పూర్తయింది కూడా.
కానీ పవన్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోతున్నారు. మరో రెండు మూడు నెలల్లో పూర్తిగా రాజకీయాలకు అంకితం కాబోతున్నారని షెడ్యూలు బయటకు వచ్చేసింది. కానీ ఈ రెండు మూడు నెలల్లో కూడా హరి హర వీరమల్లు సినిమా పూర్తి చేస్తారా? అన్నది అనుమానమే.
కొత్తగా ఒప్పుకున్న సముద్రఖని-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో పీపుల్స్ మీడియా నిర్మించే సినిమాను ఫినిష్ చేస్తారు. దానికి పవన్ కేటాయించాల్సిన డేట్ లు 20 రొజులు మాత్రమే.
మరి భవదీయుడు భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏమిటో? ఇప్పటికే ఈ సినిమాను నమ్ముకుని ఖాళీగా కూర్చుండిపోయి, కనీసం రెండు, మూడు సినిమాలు వదలుుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. అంటే పవన్ సినిమా వల్ల హరీష్ కు ఓ ముఫై కోట్లు నష్టం అన్నమాట.