పెళ్లి రోజే రచ్చ రంబోలా.. వివాదాల నయనతార

తిరుమలలో భక్తులు కొన్ని ఆచార సంప్రదాయాలు, నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తుంటారు. తెలిసో, తెలియకో ఎవరైనా వాటిని ఉల్లంఘించినా, వెంటనే పక్కవారు చెప్పడం, సర్దుకుపోవడం చేస్తుంటారు.  Advertisement కానీ కొత్త జంట నయనతార, విఘ్నేష్…

తిరుమలలో భక్తులు కొన్ని ఆచార సంప్రదాయాలు, నియమ నిబంధనలు కచ్చితంగా పాటిస్తుంటారు. తెలిసో, తెలియకో ఎవరైనా వాటిని ఉల్లంఘించినా, వెంటనే పక్కవారు చెప్పడం, సర్దుకుపోవడం చేస్తుంటారు. 

కానీ కొత్త జంట నయనతార, విఘ్నేష్ మాత్రం తిరుమల సంప్రదాయాలకు భిన్నంగా కొండపైన ఫొటోషూట్ కి పోజులిచ్చారు, అంతే కాదు.. మాడ వీధుల్లో పాదరక్షలు ధరించి పెద్ద తప్పు చేశారు. పెళ్లైన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కొత్త జంట ఇలా వివాదాల్లో చిక్కుకోవడం విశేషం.

మాడ వీధిల్లో భక్తులెవరూ పాదరక్షలు ధరించరు. ఇప్పటి వరకూ చాలామంది సినీ తారలు, వీవీఐపీలు తిరుమలకు వచ్చినా అంత సాహసం ఎప్పుడూ చేయలేదు. కానీ నయనతార మాత్రం చెప్పులేసుకుంది. దర్శనానంతరం ఆలయం బయటకు రాగానే ఆమె చెప్పులు తొడుక్కుని మాడ వీధుల్లో తిరిగింది. 

అక్కడితో ఆగలేదు. ఆలయం ముందు భర్తతో కలసి ఫొటోగ్రాఫర్లకు రకరకాల ఫోజులిచ్చింది నయనతార. సహజంగా మీడియావారు ఒకటీ అరా ఫొటోలు తీసుకుని వెళ్లిపోతారు. కానీ ఇక్కడ నయన వెడ్డింగ్ టీమ్ రంగంలోకి దిగి.. అక్కడే ఫొటోషూట్ మొదలు పెట్టింది. దీంతో పలువులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బౌన్సర్ల గొడవెందుకు..

తిరుమల శ్రీవారిని దర్శించడానికి వచ్చేవారంతా సామాన్యులే, వీఐపీ కోటాలో దర్శనాలుంటాయి కానీ, బౌన్సర్ల వ్యవహారం కొండపై అస్సలు కనిపించదు. పోనీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కొండపై హడావిడి చేసినా, వీఐపీలను కలిసేందుకు వచ్చేవారిని నెట్టివేయడం అరుదు. 

కానీ నయనతార, విఘ్నేష్ తో ఫొటోలు దిగాలని ఆసక్తి చూపించిన భక్తులను వారి బౌన్సర్లు నెట్టివేయడం మరింత సంచలనంగా మారింది. కల్యాణోత్సవంలో పాల్గొన్న కొత్త దంపతులు, ఇలా వివాదాల్లో చిక్కుకున్నారు. 

నయనతార పై కేసులు పెట్టే అంశం పై టీటీడీ చర్చలు జరుపుతోంది.