ఎన్నాళ్లీ ఆంక్షలు..జగన్ జీ!

దేశం మొత్తం మీద కరోనా తగ్గుముఖం పడుతోంది. వాస్తవం మాట్లాడుకోవాలంటే కరోనా థర్డ్ ఫేజ్ ప్రభావం దేశం మొత్తం మీద ఆంధ్రలోనే తక్కువ. పట్టుమని పది వేల కేసులు వచ్చింది లేదు. మరణాలు పెద్దగా…

దేశం మొత్తం మీద కరోనా తగ్గుముఖం పడుతోంది. వాస్తవం మాట్లాడుకోవాలంటే కరోనా థర్డ్ ఫేజ్ ప్రభావం దేశం మొత్తం మీద ఆంధ్రలోనే తక్కువ. పట్టుమని పది వేల కేసులు వచ్చింది లేదు. మరణాలు పెద్దగా లేవు. 

కానీ ఆదికి ముందే థియేటర్లు యాభై శాతం ఆక్యుపెన్సీ, నైట్ కర్ప్యూ విధించేసారు. అసలు ఈ నైట్ కర్ఫ్యూ అనేదే ఓ బ్రహ్మ ప్రదార్ధం. అది ఎందుకో? దాని వల్ల ఫలితం ఏమిటో? ఒరిగేది ఏమిటో? ఎవ్వరికీ అర్థం కాదు.

కరోనా మొదటి, రెండో విడతల కారణంగా ఆగిపోయిన సినిమాలు, అలాగే ఆ తరువాత మొదలైన సినిమాలు అనేకం పోగుపడిపోయి వున్నాయి. విడుదల చేద్దాం అంటే అసలే టికెట్ ల సమస్య. ఇదిగో కొత్త రేట్లు, అదిగో కొత్త రేట్లు అని వినిపిస్తూనే వుంటుంది. కానీ జగన్ మదిలో ఏముందో? ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరికీ తెలియదు.

కనీసం ఫుల్ ఆక్యుపెన్సీ, సెకెండ్ షో ఇచ్చినా చాలు అని చూస్తున్నారు సినిమా జనం. కరోనా కేసులు తగ్గిపోయినా కూడా ఇంకా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. ఆంధ్ర కన్నా ఎక్కువ కేసులు వున్న అనేక రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ, సెకెండ్ షో లు వున్నాయి. కానీ ఆంధ్రలో మాత్రం లేవు. 

టాలీవుడ్ ను ఆంధ్ర ప్రభుత్వ ఆంక్షల నుంచి కాపాడేదెవరో?