ఎవరు..ఎవరి బావ..ఎలా?

పూనమ్ కౌర్ ట్వీట్ లకు వేనవేల అర్థాలు. సూటిగా సుత్తి లేకుండా వుంటాయి. కానీ అలా అని ఎవ్వరి పేర్లూ వుండవు. మళ్లీ అలా అని అర్థం కాకుండా పోవు.  Advertisement కామన్ యూజ‌ర్…

పూనమ్ కౌర్ ట్వీట్ లకు వేనవేల అర్థాలు. సూటిగా సుత్తి లేకుండా వుంటాయి. కానీ అలా అని ఎవ్వరి పేర్లూ వుండవు. మళ్లీ అలా అని అర్థం కాకుండా పోవు. 

కామన్ యూజ‌ర్ కూ ఇట్టే అర్థం అయిపోతాయి. ముఖ్యంగా ఆమె ట్వీట్ ల వెనుక కనిపించకుండా వినిపించే పేర్లు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్. నిన్నటికి నిన్న ఓ ట్వీట్, అందులో షేర్ చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ మరోసారి సెన్సెషన్ అయ్యాయి.

ఎవరో పవన్ అభిమాని. మ్యాగీ అనే పేరుతో పూనమ్ కౌర్ ఫీడ్ చేసుకున్న కాంట్రాక్ట్. వాట్సాప్ లో పూనమ్ కు హాయ్ చెప్పి, ‘సినిమాకు వచ్చా అక్కా…బావ సినిమాకు’ అంది. అక్కా అంటే పూనమ్ నే..మరి ఇంతకీ ఆ బావ ఎవరు? పవన్ కళ్యాణ్. 

ఎందుకంటే నిన్న ఆయన సినిమానే గా విడుదలయ్యింది. సరే చాట్ చేసిన అమ్మాయికో..అబ్బాయికో బావ అయితే పూనమ్ కు ఏమవుతారో?

పూనమ్ ఊరుకోకుండా హానెస్ట్ రివ్యూ ఇవ్వమని కోరింది.అవతలి వారు హిట్, సిన్సియర్,,ప్రామిస్ అన్నారు. అక్కడితో అయిపోలేదు. 

తన భావాలు తాను వెలిబుచ్చింది. పైగా ఎటువంటి షరతులు లేని ప్రేమతో, తన పట్ల బాధ్యతతో వుండేవారిని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంది. ఆమె పట్ల ఎటువంటి షరతులు లేని ప్రేమ చూపిస్తున్నది ఎవరో? ఆమె పట్ల బాధ్యతగా వుంటున్నది ఎవరో?

అంతా మాయ.