ఈ మధ్యకాలంలో ఇంత రేంజ్ లో ఏ సినిమాకు ప్రచారం జరగలేదు. అన్ని ఇంటర్వ్యూలు, అంత హడావుడి, అన్ని షో లు…అన్నీ ఎఫ్ 3 గురించే. అటు హీరో వెంకటేష్ ఇటు డైరక్టర్ అనిల్ రావిపూడి, ఈ ఇద్దరితో సమానంగా నిర్మాత దిల్ రాజు ఈ ముగ్గురూ కలిసి ఈ సినిమా ప్రచారాన్ని భుజాన మోసేసారు.
కనిపించని టీవీ షో లేదు. ఇవ్వని ఇంటర్వూ లేదు… చెప్పని మాటలు లేవు. ఈ రేంజ్ ప్రచారం అందుకుంది ఎఫ్ 3.
మరి ఇంతకీ ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా వుంది? యు సర్టిఫికెట్ అందుకున్న ఈ ఫ్యామిలీ సినిమా సెన్సార్ టాక్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈవీవీ సినిమాలా వుంది.
సినిమా లో లాజిక్ లు చూడకుండా కామెడీ ఎంజాయ్ చేయడమే. అయిదారు కామెడీ బ్లాక్ లు అద్భుతంగా పండాయని బోగట్టా. సినిమా తొలిసగం మొత్తం ఎంజాయ్ చేస్తూనే వుంటారట ప్రేక్షకులు.
తమన్నా…సోనాలి ల నడుమ జరిగే ఎపిసోడ్ సెకండాఫ్ కు హైలైట్ అని తెలుస్తోంది. సినిమా మొత్తం కామెడీ సీన్లు చూసుకుంటూ ఎంజాయ్ చేయడమే. కథ థ్రెడ్, లాజిక్ లు వెదుకుతూ వుండడం వుండదు.
అచ్చంగా ఇవీవీ ఆలీబాబా అరడజను దొంగులు, ఎవరిగోల వాడిది టైపు స్క్రీన్ ప్లే అని తెలుస్తోంది. చూస్తుంటే అనిల్ రావిపూడి మొత్తానికి ఏదో మ్యాజిక్ చేస్తున్నట్లే వుంది.