ఎక్స్ క్లూజివ్-కప్పెల రీమేక్ లో..

హీరోయిన్లు కావాలి అంటే టాలీవుడ్ అయితే కర్ణాటక వైపు లేదంటే కేరళ వైపు చూస్తుంది. ఇక ముంబాయి అమ్మాయిల సంగతి సరేసరి. కాస్త సౌత్ టచ్ వుండాలంటే మాత్రం మలయాళీ హీరోయిన్లు కావాల్సిందే. Advertisement…

హీరోయిన్లు కావాలి అంటే టాలీవుడ్ అయితే కర్ణాటక వైపు లేదంటే కేరళ వైపు చూస్తుంది. ఇక ముంబాయి అమ్మాయిల సంగతి సరేసరి. కాస్త సౌత్ టచ్ వుండాలంటే మాత్రం మలయాళీ హీరోయిన్లు కావాల్సిందే.

లేటెస్ట్ గా మరో మలయాళీ హీరోయిన్ తెలుగులోకి వస్తోంది. బాలనటిగా జర్నీ స్టార్ట్ చేసిన అనిఖ సురేంద్రను ఇప్పుడు తెలుగులో తొలిసారి హీరోయిన్ గా చేయబోతోంది. 

ఇప్పటి వరకు మలయాళం, తమిళంలోనే నటించింది ఆమె. ఈఏడాది ఆరంభంలో ఓటిటిలో విడుదలై మంచి పేరు తెచ్చుకున్న కప్పెల సినిమా తెలుగు రీమేక్ కు పదహారేళ్ల అనిఖ ను తీసుకుంటున్నట్లు బోగట్టా. ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ చేసారు. దాదాపు ఓకె అయినట్లే.

కప్పెల రీమేక్ కోసం యంగ్, ప్రెష్ ఫేస్ కావాలి. ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని అనుకున్నారు. కానీ ఆమె రెండో సినిమాకే 70 లక్షలకు పైగా రెమ్యూనిరేషన్ అడగడంతో పక్కన పెట్టారు. ఎన్నయ్ ఆరిందాల్, విశ్వాసం సినిమాల్లో నటించిన అనిఖ మీద దృష్టి పడింది.

దాంతో ఆమెను పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి ఓకె చేసారు. కప్పెల రీమేక్ లొ ఇప్పటికే నవీన్ చంద్ర ఓ హీరో పాత్రకు ఓకె అయ్యారు. మరో హీరో పాత్రను విష్వక్ సేన్ కానీ మరెవరైనా అప్ కమింగ్ హీరో కానీ చేసే అవకాశం వుంది.

గ్రేటర్ కొడతాడా? ఇజ్జత్ నిలుస్తుందా?