Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య ఎక్కడ.. ఈసారి ఎలా స్పందిస్తారో!

బాలయ్య ఎక్కడ.. ఈసారి ఎలా స్పందిస్తారో!

టాలీవుడ్ కు సంబంధించి లాక్ డౌన్ టైమ్ లో అతిపెద్ద వివాదం ఏదైనా అందంటే... అది బాలయ్య వ్యాఖ్యల వివాదమే. టాలీవుడ్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో చిరంజీవి, నాగార్జున లాంటి కొంతమంది వ్యక్తులు చర్చలు మొదలుపెడితే.. భూములు పంచుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్లంతా కలిశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాలయ్య.

బాలయ్య కామెంట్స్ టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఆ తర్వాత బాలయ్య తన వ్యాఖ్యలపై స్పందించడానికి ఇష్టపడలేదు. ఎన్నో ఇంటర్వ్యూల్లో తన వ్యాఖ్యలపై వచ్చిన ప్రశ్నల్ని ఆయన స్కిప్ చేశారు.

కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి అందరి చూపు బాలయ్యపై పడింది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం సినీపరిశ్రమకు రాయితీలు ఇవ్వడంతో పాటు థియేటర్లు తెరిచేందుకు అనుమతులు ఇవ్వడమే. ఈసారి కూడా చిరంజీవి, నాగార్జునతో పాటు మరికొంతమంది సినీపెద్దల చొరవతోనే ఇది సాధ్యమైందనే విషయం కళ్లకు కనిపిస్తున్న వాస్తవం.

అప్పుడు చిరు-నాగ్ ముందుకొచ్చి చర్చలు ప్రారంభిస్తే "రియల్ ఎస్టేట్" అంటూ కాంట్రవర్సీ స్టేట్ మెంట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఇప్పుడు ఏమంటారంటూ టాలీవుడ్ లో ఓ వర్గం ప్రశ్నిస్తోంది. అప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నోటితోనే, ఇప్పుడు మెచ్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.

ఇండస్ట్రీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వెలువరించిన విధివిధానాలతో అందరూ పూర్తి సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమ ఆనందాన్ని సోషల్ మీడియా సాక్షిగా బయటపెడుతున్నారు. 

టీడీపీకి, టీఆర్ఎస్ కు పడదు కాబట్టి బాలయ్య సైలెంట్ గా ఉన్నారని అనుకోవచ్చు. కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పకపోయినా, కనీసం సినీపరిశ్రమ కోణంలోనైనా బాలయ్య స్పందిస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ అంశానికి సంబంధించి మెగా, అక్కినేని అభిమానులు అప్పుడే బాలయ్యపై ట్రోలింగ్ షురూ చేశారు. నోటికొచ్చినట్టు గతంలో వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు సైలెంట్ గా ఉండడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పట్లానే ఈ అంశానికి దూరంగా ఉన్నారు. రామోజీ ఫిలింసిటీలో తన సినిమా షూటింగ్ లో పడిపోయారు.

గ్రేటర్ కొడతాడా? ఇజ్జత్ నిలుస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?