బావగారూ బాగున్నారా..అన్నయ్య..చూడాలని వుంది..ఇంద్ర ఇలా ఎన్ని హిట్ లు ఆ కాంబినేషన్ లో. ఆ కాంబినేషన్ మరేంటో కాదు. మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్. ఆ మాటకు వస్తే బాలయ్య, మహేష్ లతో కూడా మణిశర్మ కాంబినేషన్ ఎన్నో చిత్రాలు చేసింది. కొత్త నీరు వచ్చి మణిశర్మ వెనక్కు తగ్గారు. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ మణిశర్మ తళుక్కున మెరిసారు. పైగా టాలీవుడ్ ను సంగీత దర్శకుల కొరత పట్టి పీడిస్తోంది.
అందుకే ఈ నేపథ్యంలో మెగాస్టార్-మణిశర్మల జోడీ మళ్లీ తెరపైన మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతోంది. కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి చేసే 152వ సినిమాకు మణిశర్మను మ్యూజిక్ డైరక్టర్ గా ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఈ సినిమాకు ముందుగా బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ను తీసుకోవాలనుకున్నారు. కానీ ఆఖరికి మణిశర్మనే ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కొరటాల శివ రూపొందించే ఈ సినిమాకు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కూడా కీలకం అని తెలుస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్లు బ్యాక్ గ్రవుండ్ స్కోర్ చేయరు. మళ్లీ అప్పుడు ఇక్కడ మణిశర్మనే పిలవాలి. అందుకే అన్నింటికి కలిపి ఆయననే తీసుకున్నట్లు తెలుస్తోంది.
మణిశర్మ-కొరటాల కాంబినేషన్ కాబట్టి మంచి ట్యూన్ లు వస్తాయని ఆశించవచ్చు. అలాగే మణిశర్మ నేపథ్య సంగీతానికి పెట్టింది పేరు. అందువల్ల ఈ అన్ని విధాలా ఈ కాంబినేషన్ ఫిక్స్ అనే వినిపిస్తోంది.