నటుడు కమల్ హాసన్ ఇండస్ట్రీలోకి వచ్చి అరవై యేళ్లు పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసక్తిదాయకమైన కామెంట్లు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామిపై ఆ సందర్భంలో రజనీకాంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'అద్భుతాలు మన చుట్టూరానే జరుగుతూ ఉంటాయి. రెండేళ్ల కిందట ఎడపాటి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకున్నారా? ఆయన ముఖ్యమంత్రి అయ్యాకా అయినా, ఇన్నాళ్లు పదవిలో ఉంటారని ఎవరైనా అనుకున్నారా? ఎప్పుడు ఎవరికి ఎలాంటి టైమొస్తుందో ఎవరూ చెప్పలేం..' అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు.
అది కమల్ హాసన్ అభినందన సభ. తమిళనాడు చిత్ర పరిశ్రమ ముఖ్యులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాంటి చోట రజనీకాంత్ డైరెక్టుగా ముఖ్యమంత్రి మీద వ్యంగ్యంగా మాట్లాడటం, జాక్ పాట్ సీఎం అన్నట్టుగా మాట్లాడటం గమనార్హం.
ఇటీవలే కమల్ హాసన్ ను ఉద్దేశించి ఈపీఎస్ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. కమల్ పొలిటికల్ ఎంట్రీని ఈపీఎస్ తప్పుపట్టారు. రాజకీయాల్లోకి వస్తే కమల్ హాసన్ కు శివాజీ గణేషన్ కు పట్టిన గతే పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో కమల్ అభినందన సభలో రజనీకాంత్ ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రస్తావన తీసుకు వచ్చారు.
ఆయన జాక్ పాట్ గురించి ప్రస్తావించారు. సందర్భం లేకపోయినా పళనిస్వామి గురించి రజనీకాంత్ ప్రస్తావించడం, సెటైర్ కోసమే అని స్పష్టం అవుతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.