ఉప్పెన సినిమాతో కుర్రకారు హృదయాలను గాలం వేసి లాగేసిన హీరోయిన్ కృతి శెట్టి. చకచకా సినిమాలు ఓకె చెస్తూ, కోటి రూపాయల రెమ్యూనిరేషన్ కు చేరిపోయింది.
Advertisement
లేటెస్ట్ గా మరో రెండు సినిమాలు ఓకె చేసింది. యంగ్ హీరోలు నితిన్, నాగ చైతన్యల సరసన నటించబోతోంది. నితిన్ కొత్త దర్శకుడు శేఖర్ తో చేయబోయే సినిమాకు కృతి శెట్టినే హీరోయిన్.
అలాగే కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో తయారయ్యే బంగార్రాజులో చైతన్య పక్కన హీరోయిన్ గా కూడా కృతినే ఫైనల్ చేసారు.
ఇప్పటికే రామ్ తో ఒకటి చేస్తోంది కృతి. ఇప్పట్లో కృతి క్రేజ్ ఆగేలా లేదు. ఇంకా చాలా మంది హీరోలు కృతిని తమ సరసన నటింపచేయాలని చూస్తున్నారు.