ఎక్స్ క్లూజివ్…ఇంటికి చేరిన సాయి ధరమ్

మెగా ఫ్యాన్స్ కు దసరా హ్యాపీ న్యూస్. ప్రమాదానికి గురై గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే వుంటూ చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రోజు డిశ్చార్జి అవుతున్నారు. అపోలో వైద్యులు…

మెగా ఫ్యాన్స్ కు దసరా హ్యాపీ న్యూస్. ప్రమాదానికి గురై గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే వుంటూ చికిత్స పొందుతున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రోజు డిశ్చార్జి అవుతున్నారు. అపోలో వైద్యులు ఆయనను సురక్షితంగా ఇంటికి పంపిస్తున్నారు.

ప్రమాదంలో వచ్చిన షాక్ కారణంగా సాయి ధరమ్ తేజ్ కొంతకాలం పాటు సెమీ కోమాలో వుండిపోయారు. ఆ సమయంలోనే ఆయనకు చిన్న శస్త్ర చికిత్స, ట్రీట్ మెంట్ జరిగాయి. షాక్ నుంచి బయటకు వచ్చాక ఆయనకను ఫిజియో థెరపీ కూడా చేసారు. 

కొంతకాలం అపోలోలోనే వుంటే మంచిది అని మెగా ఫ్యామిలీ భావించడంతో అక్కడే వుంచారు. ఆ సమయంలోలో రిపబ్లిక్ సినిమా విడుదల కావడం, సాయితేజ్ కు, డైరక్టర్ దేవాకు ప్రశంసలు దక్కడం జరిగింది. 

ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ పూరిగా రికవరీ కావడంతో, దసరా నాడు ఇంటికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. విశేషం ఏమిటంటే ఈ రోజు ఆయన పుట్టిన రోజు కూడా.