తెలుగులో అవెంజర్స్ లాంటి సినిమా వస్తే ఎలా వుంటుంది? రాకీ భాయ్… సలార్ లతో…ఎన్టీఆర్ జత కడితే ఎలా వుంటుంది.
ఇదే ఆలోచన ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ చేస్తున్నారు. దాన్నే కేజిఎఫ్ 3 గా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు. సలార్ రెండు భాగాలు పూర్తి చేయాలి. ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. ఈ రెండూ చేసిన తరువాతే కేజిఎఫ్3.
అటు రాకీ భాయ్ ను, ఇటు సలార్ హీరో పాత్రతో పాటు ఎన్టీఆర్ చేయబోయే హీరో పాత్రను కలిపి, అవెంజర్స్ టైప్ లో దేశాన్ని కాపాడే ఓ కాన్సెప్ట్ ను కేజిఎఫ్ 3 గా చేయాలన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన అంట. ఇప్పటికి ఇది ప్రశాంత్ నీల్ ఆలోచన మాత్రమే. ఇది కానీ కార్యరూపం దాల్చితే మామూలుగా వుండదు. బొమ్మ దద్దరిల్లిపోతుందంతే.
మూడు రకాల హీరోయిజం వున్న పాత్రలు ఒకే కథలోకి రావడం అంటే ఆషామాషీ విషయం కాదు. పైగా హీరోలు ఒకె అనాలి. స్క్రిప్ట్ బ్యాలన్స్ గా వుండాలి. ఇలా కసరత్తు ఓ రేంజ్ లో జరగాల్సి వుంటుంది. కానీ ప్రశాంత్ నీల్ సామర్థ్యం ఇప్పటికే జనాలకు తెలిసింది. అందువల్ల ఆయన తలుచుకుంటే చేయగలరు.
అందులోనూ రాకీ భాయ్ యష్, ప్రభాస్ ఈ దర్శకుడు అంటే పిచ్చి ఇష్టంతో వున్నారు. ఎన్టీఆర్ కూడా అదే రేంజ్ ఇష్టం పెంచుకుంటే ఇది సాధ్యపడుతుంది.