టాప్ డైరక్టర్ త్రివిక్రమ్…టాప్ హీరో ఎన్టీఆర్ ను కలిసారు. అయితే ఏంటంట? అని అనడానికి లేదు. ఎందుకంటే ఈ ఇద్దరికీ మధ్య సమ్ థింగ్..సమ్ థింగ్..చెడిందని వార్తలు వచ్చాయి.
దానికి అనుగుణంగానే వారి కాంబినేషన్ లో జరగాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందువల్ల ఇక త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ దూరం దూరం అని ఫిక్స్ అయిపోయింది.
కానీ రాజకీయాల్లో, సినిమాల్లో వైరం అనేది శాశ్వతం కాదు. మహేష్ తో ప్యాచప్ అయిపోయి సినిమా స్టార్ట్ అవుతోంది. అలాంటిది ఎన్టీఆర్ తో ప్యాచప్ కావడం అసాధ్యం కాదు కదా? అందుకు అకేషన్ రానే వచ్చింది.
ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే. అందుకే త్రివిక్రమ్ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ కూడా సాదరంగా ఆహ్వానించినట్లు బోగట్టా.
సో ఇప్పుడు విబేధాలు అన్నీ ఆటలో అరటిపళ్లే…మహేష్ సినిమా తరువాత ఇమ్మీడియట్ గా కాకున్నా, మొత్తానికి మళ్లీ అరవింద సమేత లాంటి మాంచి బ్లాక్ బస్టర్ ను మనం చూడొచ్చు.