Advertisement

Advertisement


Home > Movies - Movie News

రాజ్ కుంద్రా- శిల్పాషెట్టి..క‌ళ్లు చెదిరే ఆస్తులివే!

రాజ్ కుంద్రా- శిల్పాషెట్టి..క‌ళ్లు చెదిరే ఆస్తులివే!

పోర్న్ వ్య‌వ‌హారంలో పోలీసుల‌కు చిక్కిన వ్యాపార వేత్త‌, శిల్పా షెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాకు సంబంధించి క‌ళ్లు చెదిరే ఆస్తులున్నాయి. ఇవ‌న్నీ కుంద్రా పోర్న్ ద్వారానే సంపాదించాడ‌ని ఎవ‌రూ అన‌లేరు కానీ, ఈ వివాదం నేప‌థ్యంలో వారికి ఉన్న క‌ళ్లు చెదిరే సంప‌ద అంతా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

అమెరికన్ రియాలిటీ షో బిగ్ బ్ర‌ద‌ర్ లో పాల్గొన్న త‌ర్వాత శిల్పా షెట్టి జాత‌క‌మే మారిపోయింది. అప్ప‌టికి బాలీవుడ్ లో అవ‌కాశాలు అడుగంటుతున్న ద‌శ‌లో బిగ్ బ్ర‌ద‌ర్ షో ద్వారా శిల్ప పాపుల‌ర్ అయ్యింది. వివిధ కార్య‌క్ర‌మాల‌కు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తూనే బాగా సంపాదిస్తూ వ‌స్తోంది. ఇక రాజ్ కుంద్రాది వ్యాపార నేప‌థ్యం. వీరి పెళ్లితో జాయింటుగా వీరికి భారీగా ఆస్తులు పోగ‌యిన‌ట్టుగా ఉన్నాయి.

వాటి వివ‌రాల్లోకి వెళితే.. ముంబైని జుహూ ఏరియాలో రాజ్ కుంద్రా- శిల్పాల‌కు ఒక విలాస‌వంత‌మైన విల్లా ఉంది. అక్క‌డే వీరి మ‌కాం. అక్క‌డ నుంచి దిగిన వివిధ ఫ్యామిలీ ఫోటోల‌ను శిల్ప పోస్టు చేస్తూ ఉంటుంది. ఈ జంట‌కు ఇద్ద‌రు పిల్ల‌లున్నారు.  

ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ గా పేరు పొందిన దుబాయ్ లోని బూర్జ్ ఖ‌లీఫాలో కూడా వీరికో ఫ్లాట్ ఉండేది. దాన్ని త‌మ వెడ్డింగ్ గిఫ్ట్ గా శిల్ప‌కు ఇచ్చాడ‌ట రాజ్ కుంద్రా. 19వ అంత‌స్తులోని ఆ ఫ్లాట్ ను  వీరు ఆ త‌ర్వాత అమ్మేశార‌ట‌. త‌మ కుటుంబం వెళ్లి స్టే చేయ‌డానికి ఇరుక‌వుతోంద‌ని వీరు దాన్ని అమ్మేశార‌ట‌.

ఇంగ్లాండ్ లో ఒక మ్యాన్ష‌న్ ఉంద‌ట‌. స‌ర్రేలో ఈ జంట‌కు ఆ అంద‌మైన మ్యాన్ష‌న్ ఉంద‌ట‌. త‌మ హాలీడేస్ ను వీరు అక్క‌డ స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే వీరికో ప్రైవేట్ జెట్ ఉంది. ఎక్క‌డికైనా వెళ్లాలంటే ఎంచ‌క్కా ప్రైవేట్ జెట్ లో వెళ్లేంత విలాస‌వంతంగా ఉంటుంది వీరి జీవితం. ఇక ల‌గ్జ‌రీ కార్ల‌కూ లోటు లేదు. 

ఇండియాలో లాంచ్ కాక ముందే కొత్త మోడ‌ల్ లాంబోర్గినీ కార్ ను త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో నిలుపుకుంది శిల్ప‌! అలాగే ఆమెకు ఒక బీఎండ‌బ్ల్యూ జెడ్ 4 కారు కూడా ఉంది. ఇంకా వీరి ఎంగేజ్ మెంట్ లో శిల్ప‌కు రాజ్ కుంద్రా పెట్టిన ఉంగ‌రం ఖ‌రీదు మూడు కోట్ల రూపాయ‌లు. పెళ్లిలో శిల్ప ధ‌రించిన లెహంగా ధ‌ర 50 ల‌క్ష‌లు! ఇదీ శిల్పా-రాజ్ ల ల‌గ్జ‌రీయ‌స్ లైఫ్ స్టైల్!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?