ఎఫ్ 3 ప్రమోషన్ షురూ

ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి దానికి సీక్వెల్ గా చేస్తున్న ప్రయత్నం ఎఫ్ 3. మళ్లీ మరోసారి వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తెరపైకి నవ్వులు పడించడానికి…

ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత అనిల్ రావిపూడి దానికి సీక్వెల్ గా చేస్తున్న ప్రయత్నం ఎఫ్ 3. మళ్లీ మరోసారి వెంకీ, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తెరపైకి నవ్వులు పడించడానికి వస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. 

అయితే ఇటీవల పాటలు వీలయినంత మందుగా విడుదల చేయడం అన్నది ట్రెండ్ గా మారింది. పాటలు వైరల్ అయితేనే సినిమాలకు మాంచి ఓపెనింగ్ లు వుంటున్నాయి. అందుకే ఎఫ్ 3 సినిమా పాటల విడుదలను ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నారు.

దేవీశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ‘లబ్ డబ్..లబ్ డబ్..డబ్బూ’ అనే పాటను తొలిగా రధసప్తమి రోజున విడుదల చేస్తున్నారు. ఎఫ్ 3 సినిమా డబ్బు చుట్టూ తిరిగే ఫన్ కామెడీ అన్న సంగతి తెలిసిందే. అందుకే ఆ స్టయిల్ గీతాన్ని ముందుగా విడుదల చేస్తున్నారు.

ఎఫ్ 2లో వున్న నటులతో పాటు సోనాలి చౌహాన్ ఈ సినిమాలో కొత్తగా యాడ్ అయింది. అలాగే కమెడియన్ సునీల్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక పాట మినహా మిగిలిన టాకీ అంతా పూర్తయింది.