రామ్ చరణ్ టీమ్ ఛలో అమృత్ సర్

రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం శంకర్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. …

రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియా డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం శంకర్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 

ఇటీవలే విశాఖ, తూర్పుగోదావరి ప్రాంతాల్లో తన టీమ్ తో పర్యటించి కొన్ని ప్రదేశాలు చూసారు.ఇప్పుడు మొత్తం టీమ్ తో, ఆర్ట్ డైరక్టర్ తో కలిసి అమృత్ సర్ బయలు దేరారు. అక్కడ కొన్ని లోకేషన్లు రెక్కీ చేసి వస్తారు.

పొలిటికల్ టచ్ వున్న ఈ సినిమా కోసం ఓ మిడిల్ క్లాస్ ఇల్లు, కొన్ని ఎన్నికల సీన్లు అవసరం అవుతాయని తెలుస్తోంది. అలాగే అమరావతి అన్నది కూడా సినిమాలో కీలకంగా వుంటుందని తెలుస్తోంది. మరి అందుకోసం అమరావతిలో షూట్ చేస్తారో, సెట్ లు వేస్తారో తెలియాల్సి వుంది.

సెట్ ల జాబితాలో అయితే మిడిల్ క్లాస్ ఇల్లు, ప్రభుత్వ కార్యాలయం, అమరావతి ఇలా పలు ప్రదేశాలు వున్నాయి. అమృత్ సర్ లో ఏమిటి షూట్ పార్ట్ అన్నది తెలియాల్సి వుంది. చాలా భారీ బడ్ఙెట్ తో తయారవుతున్న ఈ సినిమాలో జీ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామి. సగం పెట్టుబడి జీ స్టూడియోస్ పెడుతోంది.