Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎఫ్ 3 సక్సెస్ మూడోవారం చెబుతోంది-దిల్ రాజు

ఎఫ్ 3 సక్సెస్ మూడోవారం చెబుతోంది-దిల్ రాజు

'' మూడో వారంలో కూడా ఎఫ్ 3ని చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మూడో వారం కూడా సినిమా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రాబట్టడమే ఎఫ్ 3 విజయానికి నిదర్శనం'' అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. 

ఎఫ్ 3 బ్లాక్ బస్టర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఎఫ్ 3 విడుదలైనప్పటి నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ, తెలుగు రాష్ట్రాలు, ఓవర్సిస్ లో అద్భుతమైన విజయం సాధించింది. దర్శకుడు అనిల్ రావిపూడితో ఐదు విజయవంతమైన సినిమాలు పూర్తయ్యాయి. డబుల్ హ్యాట్రిక్ కి రెడీ అవుతున్నాం. వెంకటేష్ గారితో మూడు విజయాలు, వరుణ్ తేజ్ గారితో మూడు విజయాలు అందుకున్నాం.

పాండమిక్ తర్వాత వీకెండ్ సినిమాలైపోయాయి. శుక్ర, శని, ఆదివారాలు కలెక్షన్ వుండి తర్వాత తగ్గిపోతున్నాయి. పాండమిక్ తర్వాత సినిమాలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకా రాబోతున్నాయి. దిన్ని మేము అర్ధం చేసుకొని ప్లానింగ్ మార్చుకోవాలి. ఇంత పాండమిక్ లో కూడా నిన్నటికి 17రోజులు పూర్తయి థర్డ్ వీకెండ్ కూడా ఎఫ్ 3ని ప్రేక్షకులు చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మూడో వారం కూడా సినిమా థియేటర్ లో ఆడుతూ ఇంకా రెవెన్యూ రావడమే ఎఫ్ 3 విజయానికి నిదర్శనం అన్నారు.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. సినిమా ఇలానే ఉండాలనే రూల్ లేదు. దాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రూవ్ చేశారు. హీరోకి కళ్ళు కనపడవు, ఇంకో హీరో సరిగా మాట్లాడలేడు. అమ్మాయిలకి రోమాన్స్ కన్నా డబ్బు పిచ్చి ఇలా అసాధ్యమైన అంశాలని పెట్టి విజయం సాధించడం అనిల్ రావిపూడికి ఒక్కడికే సాధ్యం. అనిల్ సినిమాకి రావాలంటే ఇంట్లో  చిరాకులన్నీ మర్చిపోయి ఖాళీ బుర్రతో రావాలి. అప్పుడు జేబు నిండా నవ్వులు వేసుకొని వెళ్ళొచ్చు అని అన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 ఇలా ఆరుకి ఆరు సినిమాలు మీ గుండెల్లో పెట్టుకొని ఆదరించారు. ఇది నాకు చాలా పెద్ద విషయం. ముందు ముందు చేసే సినిమాలకి ఇది గ్రేట్ ఎనర్జీ. చిన్నప్పటి నుండి థియేటర్ లో కూర్చుంటే బాల్కనీ నుండి నేల వరకూ అందరూ ఇష్టపడే సినిమాలని ఇష్టపడే వాడిని. అందుకే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండే కథని రాస్తుంటాను. నాకు గొప్ప పేరు వస్తుందా రాదా అని అలోచించను. డబ్బులు పెట్టి సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఎలా ఎంటర్ టైన్ చేయాలనే ఆలోచనతోనే కథలు రాస్తుంటాను.

నాకు తెలిసిన సినిమా అదే. అదే తీస్తున్నాను అదే మీరు ఆదరిస్తున్నారు. వారం గడిస్తే సినిమా ఉంటుందా అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఎఫ్ 3 థర్డ్ వీకెండ్ లో కూడా షేర్ రాబడుతూ, కొన్ని చోట్ల హౌస్ ఫుల్స్ అవుతూ ప్రేక్షకులు ఆధరిస్తున్నారంటే .. ఇది నిజమైన విజయం అన్నారు.'F2' ఫ్రాంచైజీతో మళ్ళీ వస్తాం. ఫన్ అండ్ ఫస్ట్రేషన్ తో మిమ్మల్ని మళ్ళీ అలరిస్తాం. ఆరు నెలల్లో నటసింహ నందమూరి బాలకృష్ణ 'ఎన్ బీకే 108'తో మళ్ళీ కలుద్దాం '' అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?