తగ్గేదేలే.. షెకావత్ సాబ్ వచ్చేశాడు

షెకావత్ సాబ్.. పుష్ప సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర ఇది. పుష్ప క్యారెక్టర్ కు సరిసమానంగా ఉన్న రోల్ ఏదైనా ఉందంటే అది షెకావత్ రోల్ మాత్రమే. పుష్ప-2లో ఈ క్యారెక్టర్ కు మరింత వెయిట్…

షెకావత్ సాబ్.. పుష్ప సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర ఇది. పుష్ప క్యారెక్టర్ కు సరిసమానంగా ఉన్న రోల్ ఏదైనా ఉందంటే అది షెకావత్ రోల్ మాత్రమే. పుష్ప-2లో ఈ క్యారెక్టర్ కు మరింత వెయిట్ ఉందనే విషయాన్ని సుకుమార్ గతంలోనే చెప్పాడు. ఇప్పుడీ క్యారెక్టర్ పోస్టర్ వచ్చింది.

పుష్ప-2 సినిమా నుంచి ఫహాద్ ఫాజిల్ నటించిన భన్వర్ సింగ్ షెకావత్ లుక్ రిలీజైంది. ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2, ది రూల్ సినిమా నుంచి షెకావత్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ అదిరింది. సినిమాలో ఈ పాత్ర మరింత డేంజరస్ గా, పవర్ ఫుల్ గా ఉంటుందనే విషయాన్ని ఈ ఫస్ట్ లుక్ తో చెప్పకనే చెప్పారు మేకర్స్.

పుష్ప-2 ది రూల్ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను ఇదివరకే రిలీజ్ చేశారు. ఆ లుక్ తో పాటు, ఆ టైమ్ లో విడుదల చేసిన గ్లింప్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫహాద్ ఫస్ట్ లుక్ తో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

బన్నీ హీరోగా, సుక్కూ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా జాతీయ స్థాయిలో హిట్టయింది. మరీ ముఖ్యంగా 'తగ్గేదేలే' అనే మేనరిజమ్, 'ఊ అంటావా..' అనే సాంగ్ వైరల్ అయ్యాయి.  దీంతో పార్ట్-2పై అంచనాలు పెరిగాయి.

లెక్కప్రకారం, పార్ట్-2 ఈ పాటికే రిలీజ్ అవ్వాలి. కానీ పాన్ ఇండియా అప్పీలో కోసం బన్నీ సూచనల మేరకు కథ, స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేశారు. గ్రాఫిక్స్ పరంగా వచ్చిన విమర్శల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు ఆలస్యమౌతోంది.