నైజాంలో పెద్ద సినిమాల కలెక్షన్లు అన్నీ ఫేక్ అని ప్రేక్షకులకు ఓ అభిప్రాయం స్ధిరమైపోయింది. ఏ హీరో సినిమా అయినా మొదటి రోజునే మూడు నుంచి నాలుగు కోట్లు కలిపేస్తున్నారని అర్థమైపోయింది.
నైజాంలో ఎక్కువ సినిమాలు విడుదల చేసేది డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే కాబట్టి, ఇదంతా ఆయన పనే అని జనాల్లో ఓ అభిప్రాయం వుంది. కానీ దీని మీద నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
ఏ రోజు కలెక్షన్లు ఆ రోజు నిర్మాతలకు పంపించడం తప్ప, తనకు ఏ సంబంధం లేదన్నారు. అలా అని చెప్పి తనే కలెక్షన్లు బయటకు వెల్లడించలేనన్నారు. ఫేక్ కలెక్షన్ల వల్ల ఒరిగేదేమీ లేదని, ఫ్యాన్స్ కు ఓ అరగంట ఆనందం తప్ప మరేం కాదని ఆయన అన్నారు.
అదే విధంగా టికెట్ రేట్లు పెంచడం కూడా తన వ్యవహారం కాదన్నారు. నిర్మాతలు, హీరోలు కోరడం వల్లనే. ఎక్కువ రేట్లు తేవాల్సి వస్తోందన్నారు.
కేజిఎఫ్ 2 సినిమాకు కూడా నిర్మాతలే రేట్లు అడిగారన్నారు. ఆంధ్రలో కూడా అడిగినా వీలు కాలేదని దిల్ రాజు వెల్లడించారు. అందుకే రెండు నెలల కిందటే తాను నిర్ణయం తీసుకుని, ఎఫ్ 3 సినిమాకు నార్మల్ రేట్లు వుంచాన్నారు.