Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఫ్యామిలీ 'దొంగ' కార్తీ

ఫ్యామిలీ 'దొంగ' కార్తీ

వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుని, ఎంచుకుని మరీ చేసే తమిళ హీరోల్లో కార్తీ కూడా వున్నాడు. ఖాకీ, ఖైదీ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కార్తీ లేటెస్ట్ సినిమా దొంగ. ఈ సినిమా ఈనెల 20న రూలర్, ప్రతిరోజూ పండగే లాంటి తెలుగు సినిమాలకు పోటీగా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రయిలర్ ఇప్పుడు విడుదలయింది.

ఈ సినిమాలో ఇంటి నుంచి వెళ్లిపోయి, దొంగగా మారి ఇంటికి 'శర్వా'గా వచ్చిన కార్తీ ఇచ్చిన పెర్ ఫార్మెన్స్ ట్రయిలర్ లో బాగానే చూపించారు. ట్రయిలర్ లో ఈ మేరకు ఒక డైలాగు కూడా వేసారు. లైన్ మరీ కొత్తగా అనిపించడం లేదు కానీ, అన్ని రకాలా షేడ్స్ జోడించడానికి వీలయినట్లుగా వుంది.

కార్తీ స్టయిల్ ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, థ్రిల్లర్ టచ్ ఇలా అన్నీ వున్న సినిమా అన్నది ప్రొజెక్ట్ చేయడానికి మాగ్జిమమ్ ట్రయ్ చేస్తూ ట్రయిలర్ కట్ చేసారు. ట్రయిలర్ వున్న మేరకు సినిమా కూడా వుంటే తెలుగు సినిమాలకు కాస్త పోటీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బాలయ్య రూలర్ పక్కా బిసి సెంటర్ల సినిమా. సాయి తేజ్ 'ప్రతిరోజూ పండగే' ఫ్యామిలీ టచ్ వున్న సినిమా. ఈ లెక్కన దొంగ అటు ఇటు అన్ని జోనర్లను టచ్ చేసేలా వుంది.

https://www.youtube.com/watch?v=1yvkExmtxeg&feature=youtu.be

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?