టైటిల్ మాత్రమే కాదు, అసలు కాన్సెప్ట్ నే భిన్నంగా పెట్టుకుని నిర్మించిన చిన్న సినిమా 'స్వ'. కొత్త నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్ ఇలా అందరూ కలిసి తయారు చేసిన సైకలాజికల్ థ్రిల్లర్. ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయాలని డిసైడ్ చేసారు.
నిజానికి ఈటైమ్ లో ఓ చిన్న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అంటే చాలా రిస్క్ నే. కానీ నిర్మాత జీ.ఎం సురేష్ ఆ రిస్క్ కు సిద్దపడ్డారు. మను పి వి దర్శకత్వం లో మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య తారాగణం గా నటించిన స్వ చిత్రం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సంగీతాన్ని కరణం శ్రీ రాఘవేంద్ర సమకూర్చారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రయిలర్ ఆసక్తికరంగా వుందన్న టాక్ ను తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత సురేష్ మాట్లాడుతూ ఇటీవలే మా ఈ స్వ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ వారి నుండి మంచి అభినందనలు అందుకుంది. సినిమా పై పూర్తీ నమ్మకం తో థియేటర్లలో విడుదల చేస్తున్నాం అన్నారు.