కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. ఫిబ్రవరి రెండో వారం వేళకు అంతా నార్మల్ అవుతుందని, సెకెండ్ షో కి ఆంధ్రలో అవకాశం వస్తుందని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. అందుకే విడుదల డేట్ ల ప్రకటనలు మళ్లీ మొదలయ్యాయి.
ఫిబ్రవరి 4న విశాల్ సామాన్యుడు రాబోతోంది. 11న రవితేజ ఖిలాడీ, సిద్దు జొన్నలగడ్డ డిజె టుల్లు వస్తున్నాయి. 25న గతంలో వేసిన పవన్ భీమ్లా నాయక్ డేట్ వుండనే వుంది. మరి దాని విడుదల మీద సందేహం వుందేమో, శర్వానంద్ ఆడవాళ్లూ మీకు జోహార్లు డేట్ అనౌన్స్ చేసారు.
ఇదిలా వుంటే భీమ్లా నాయక్ సంగతి తేలితే ఆ డేట్ కు ప్రభాస్ రాధేశ్యామ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు కానీ గంగూభాయి డేట్ వేసేయడంతో ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఆ తరువాత వారం అంటే మార్చి తొలివారంలో రాధేశ్యామ్ ను విడుదల చేసే అవకాశం వుంది. రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ల డేట్ లు తేలితే వరుణ్ తేజ్ గని సినిమా డేట్ ఫిక్స్ అవుతుంది.
వీటన్నింటి మధ్య ఇంకా చిన్న చిన్న సినిమాలు వుండనే వున్నాయి. ఇకపై వరుసగా డేట్ ల ప్రకటనలు వస్తాయని టాలీవుడ్ వర్గాల బోగట్టా. కరోనా ఫస్ట్ ఫేజ్ నుంచి ఇప్పటి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. డేట్ లు వేయడం. వాయిదా వేయడం. ఎప్పటికి ఈ పరిస్థితి మారుతుందో?