లాక్ డౌన్ తర్వాత ‘అడ్వాన్స్ బుకింగ్’ ఇదే..!

సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. సినిమాలు కూడా వరుసపెట్టి వస్తున్నాయి. కొన్నింటికి మొదటి 3 రోజులు ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం ఇప్పటివరకు జోష్ కనిపించలేదు.…

సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. సినిమాలు కూడా వరుసపెట్టి వస్తున్నాయి. కొన్నింటికి మొదటి 3 రోజులు ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం ఇప్పటివరకు జోష్ కనిపించలేదు. బుక్ మై షో లాంటి సైట్స్ చాలా డల్ గా నడుస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సెగ్మెంట్ లో కూడా ఊపొచ్చింది. లవ్ స్టోరీ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.

నిజానికి లవ్ స్టోరీ సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉంది. కానీ అన్ని ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో వారం ముందే ఆన్ లైన్ బుకింగ్స్ తెరిచారు. హైదరాబాద్ లో దాదాపు అన్ని మల్టీప్లెక్సులకు సంబంధించి ఆన్ లైన్ బుకింగ్ మొదలైంది. ఆశ్చర్యకరంగా వారం ముందే బుకింగ్స్ ఆశాజనకంగా సాగుతున్నాయి. ఇదే ట్రెండ్ నడిస్తే, మరో 4 రోజుల్లో టోటల్ టిక్కెట్లు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అటు ఆంధ్రాలోని విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది. బెజవాడలోనైతే అలంకార్ తో పాటు మరో సినిమా హాల్ లో 4 షోలకు సంబంధించి దాదాపు టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోవడం విశేషం.

లాక్ డౌన్ తర్వాత చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిలో రాజ రాజ చోర, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయి కూడా. కానీ స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలు లేకపోవడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ లో ఊపు కనిపించలేదు. 

ఇన్నాళ్లకు నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ముల కలిసి చేసిన లవ్ స్టోరీతో ఆ ఊపు వచ్చింది. ఇకపై థియేటర్లలో ఇదే జోరు కొనసాగి, మళ్లీ పాత రోజులు రావాలని కోరుకుందాం.